ఈ సీటు మార్పు ఎవరి ఫేటు మార్చుతుంది?

sri

శ్రీధర్ బాబు నుండి శాసన సభా వ్యవహారాల శాఖను నిన్న రాత్రి అర్ధాంతరంగా తొలగించారు రాష్ట్ర ముఖ్య మంత్రి. TV ఛానళ్ళు, ఈ రోజటి దిన పత్రికలు ఈ హఠాత్ పరిణామాన్ని కిరణ్, సీమాంధ్ర పక్షం వారి కొత్త ఎత్తుగడగా వర్ణిస్తున్నాయి. కొన్ని పత్రికలు కాంగ్రెస్ అధిష్టానం కూడా CM కుట్రలో భాగస్వామియే అని కూడా తీర్మానించాయి. మంత్రి శ్రీధర్ బాబు పెద్దలతో మాట్లాడుతాననీ, వాణిజ్య పన్నుల శాఖ తనకు వద్దనీ అన్నారు. జానారెడ్డి గవర్నర్ ను కలిసి ఇది తెలంగాణా పై జరిగిన మరో దాడి, CM పైశాచికత్వం అనీ, కొద్ది రోజుల సంయమనం తెలంగాణా ప్రజానీకానికి అవసరం అని అన్నారు. KCR అంత ప్రధానమైన విషయం కాదని కొట్టి పడేసారు. సీమాంధ్ర నాయకులు ఇది CM అధికారాలకు సంబంధించిన విషయమే తప్ప రాజకీయాలు లేవని అన్నారు.

రాజ్యాంగం రాష్ట్ర పతి కి ఇచ్చిన పూర్తి అధికారాలతో విభజన బిల్లు పై రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాన్ని కోరారు. BAC లో బలాబలాలు, అసెంబ్లీ లో సమైక్య తీర్మానం, శాసన వ్యవహారాల బాధ్యుడిగా ఉన్న మంత్రి పోషించే పాత్ర లాంటి విషయాలన్నీ ప్రజలు నేరుగా చూస్తూనే ఉన్నారు. ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా ఈ విషయాన్ని వ్యక్తి, ముఠా ల ఆధిక్య నిరూపణ కు మాత్రమె సంబంధించినది గా చూసి, వ్యూహాలు కుట్రలు పన్నే దశలోనే నాయకులు ఉన్నట్లయితే అది కేవలం తెలుగు జాతి దుర్భాగ్యం గానే భావించాలి. ఇలాంటి సంకుచిత one-up-man ship ప్రయత్నాలు నాయకుల మధ్య పెద్దరికాన్ని నిరూపించుకునే వ్యూహాత్మక గొప్పతనంగానే మిగిలి పోవు. జాతి వైరాలకు దారితీసే నేపధ్యాలను తాము సృష్టిస్తున్నామనే సంగతి వీళ్ళకు ఎవరైనా గుర్తు చేస్తే బాగుంటుంది.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy