ఉంటే ఎండలు.. లేదంటే వానలు..!!

el_nino_500ఎల్ నినో ఎఫెక్ట్ రైతులను భయపెడుతోంది. ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది దేశంలో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వర్షాభావ పరిస్థితులతో ఈ ఖరీఫ్ లోనూ కష్టాలు తప్పవనే ఆందోళనలో ఉన్నారు అన్నదాతలు. ఎల్ నినో ను స్పానిష్ భాషలో లిటిల్ బాయ్ అని పిలుస్తారు. దక్షిణ అమెరికా పశ్చిమ తీరంలోని పసిఫిక్ మహా సముద్రంలో నీటి ఉష్ణోగ్రతలు సడెన్ గా పెరగడాన్నే ఎల్ నినో అంటారు. ఉపరితలం పై ఆవరించిన దట్టమైన ఆవిరి మేఘాలు రతుపవనాలను అడ్డుకుంటాయి. దీని ప్రభావంతో భారత్ లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడనున్నాయి. పెరు, అమెరికా వంటి దేశాల్లో మాత్రం అత్యధిక వర్షపాతం నమోదుకానుంది.

భారత్ పై ఎల్ నినో ప్రభావం చూపించడం ఇదేం ఫస్ట్ టైమ్ కాదు. నాలుగు నుంచి ఐదేళ్లకోసారి ఎల్ నినో పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఎల్ నినో వచ్చిన ప్రతిసారి దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన కరువు ఏర్పడింది. కొన్నిసార్లు ఇది రివర్స్ అవుతుంది. 2009 లో రుతు పవనాలు ఆలస్యంగా  వచ్చినప్పటికీ దేశ వ్యాప్తంగా వానలు దంచికొట్టాయి. వాతావరణ సమతుల్యత దెబ్బతినడం వల్లే ఎల్ నినో ఎఫెక్ట్ కనపడుతోందని నిపుణులు అంటున్నారు. మరో వైపు ఎల్ నినో ను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. జూలై 15లోపు వర్షాలు కురవకుంటే ఎలాంటి పంటలు వేయాలి. ఆ తర్వాత కురిసే వానలను బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై డిటేయిల్డ్ గా రిపోర్ట్ రెడీ చేశారు. ఈ టైంలో ఆరుతడి పంటలు వేయడమే బెస్ట్ అంటున్నారు అధికారులు.

వర్షాభావ పరిస్థితుల వల్ల లాస్ట్ ఇయర్ ఖరీఫ్, రబీలో తీవ్రంగా పంట నష్టపోయారు రైతులు. ఈ ఇయర్ కూడా  అదే పరిస్థితి రిపీట్ అవకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. మరోవైపు అగ్రికల్చర్ సైంటిస్ట్ లు మాత్రం ఈ ఇయర్ ఎల్ నినో ఎఫెక్ట్ అంతగా ఉండకపోవచ్చంటున్నారు. ఎల్ నినో వచ్చిన ప్రతిసారి కరువు ఏర్పడలేదంటున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు బాగానే పడే అవకాశం ఉందంటున్నారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఎల్ నినో ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ రుతుపవనాల వల్ల భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy