ఉక్రెయిన్ జర్నలిస్టుకి నోబెల్ సాహితీ పురస్కారం

0,,16549620_303,00ఆమె అక్షరాలు ఆయుధాలు. ప్రపంచాన్ని నిద్రలేపుతుంటాయి ఆమె రచనలు. రక్తసిక్తమైన చరిత్రకు అద్దం పడతాయి. సామ్రాజ్యవాద దాహంతో విరుచుకుపడే రాజ్యాలను ఆలోచనలో పడేస్తుంటాయి. అందుకే ఆమెకు నోబెల్ సాహితీ పురస్కారం వరించింది. ఆమెనే స్వేత్లానా అలెక్సివిచ్. నోబెల్ లిటరేచర్ అవార్డ్ ను సొంతం చేసుకున్న 14వ మహిళగా స్వెత్లానా రికార్డ్ సృష్టించారు.

పూర్తిపేరు స్వెత్లానా అలెగ్జాండ్రోనా అలెక్సివిచ్. ఉక్రేయిన్ లో పుట్టి… సాహితీ వనంలో సుమగంధమైన రచయిత్రి.  రక్తసిక్తమైన ప్రపంచ చరిత్రకు అద్దం పడతాయి స్వెత్లానా అలెగ్జీవి రచనలు. ఆమె కలం నుంచి కన్నీటి ధారలు కారుతాయి. యుద్ధాలు, దేశాల పతనాలు మిగిల్చిన విషాదాలు కనిపిస్తాయి. చెర్నోబిల్ ట్రాజెడీని ప్రపంచానికి తన కలంతో కళ్లకు కట్టింది. నాటి ఘటనకు బలవుతున్న తరతరాల జీవనగాధలను వినిపించింది. లైఫ్ టైంలో జనం ఎదుర్కొంటున్న కష్టనష్టాలను వాళ్ల మాటల ద్వారానే చెప్పించడం ఆమె సహజ శైలి.

0,,18764360_403,00వృత్తిరీత్యా జర్నలిస్టు అయిన స్వెత్లానా…1948లో ఉక్రెయిన్ లో పుట్టారు. తండ్రిది బెలారస్. తల్లిది ఉక్రేయిన్. స్కూలింగ్ పూర్తికాగానే.. లోకల్ పేపర్స్ లో జర్నలిస్ట్ గా జీవితం ప్రారంభించారామె. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా అపార అనుభవం ఆమె సొంతం. నోబెల్ అవార్డును ఆవిష్కరించాక ఆ అవార్డును గెలుచుకున్న తొలి జర్నలిస్టు స్వేత్లానానే కావడం విశేషం. ఇంతవరకు సాహిత్యంలో నోబెల్ అందుకున్న మహిళల్లో ఆమె 14వ మహిళ స్వెత్లానా.

చెర్నోబిల్ అణు దుర్ఘటనపై పుస్తకం రాసేందుకు ఆమెకు పదేళ్లు పట్టింది. బాధితుల్లో ప్రతి ఒక్కరినీ ఇంటర్వ్యూ చేసి మరీ బుక్ రాయడమే అందుకు కారణం. ఈ పుస్తకానికే ఇప్పుడు నోబెల్ లిటరేచర్ అవార్డు దక్కింది. రెండో ప్రపంచ యుద్ధం, అఫ్ఘాన్-సోవియట్ వార్, సోవియెట్ పతనంపై ఆమె రాసిన పుస్తకాలు..పలు అవార్డులు తెచ్చిపెట్టాయి. సేమ్ టైం…జీవితంలో పలు దేశాల నుంచి ఒత్తిళ్లను ఫేస్ చేశారు. అందుకే… 2000 సంవత్సరంలో బెలారస్ ను వీడాల్సి వచ్చింది. పారిస్, గూటన్ బర్గ్, బెర్లిన్ లో ప్రవాస జీవితం గడిపారామె. 2011 లో తిరిగి మిన్స్క్ నగరానికి చేరుకొని అక్కడే స్థిరపడ్డారు.

పీస్ ప్రైజ్ అఫ్ జర్మనీ, బుక్ ట్రేడ్, ప్రిక్స్ మెడిసిస్ లాంటి అత్యున్నత అవార్డులెన్నో గెలుచుకున్న ఈ సాహితీవెత్త…ఇపుడు అత్యున్నత నోబెల్ అవార్డ్ ను అందుకోబోతున్నారు. డిసెంబర్ 10న ఆల్ఫెడ్ నోబెల్ జయంతి సందర్భంగా…నోబెల్ లిటరేచర్ అవార్డ్ ను అందుకుంటారు స్వెత్లానా.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy