ఉగ్రవాదంపై భారత్ కలిసి పనిచేస్తాం: పాక్

masoodazharపఠాన్ కోట్ ఘటనపై ఇండియా ఒత్తిడితో… పాక్ పని మొదలుపెట్టింది. దాడికి బాధ్యులుగా భావిస్తున్న జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్, అతని సోదరుడు రెహ్మాన్ రవూఫ్ లను అరెస్టు చేసింది. వీరితోపాటు మరికొందరు జైషే ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు పాక్ ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది. జైషే సంస్థకు చెందిన కార్యాలయాలను కూడా సీజ్ చేసినట్లు తెలిపింది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఉగ్రవాదంపై పోరాటానికి భారత్ తో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. పఠాన్ కోట్ ఘటనపై విచారణ కోసం ఐఎస్ ఐ, ఎంఐ, ఐబీలతో పాక్ ప్రధాని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే… మసూద్ అజర్ ను భారత్ కు అప్పగిస్తారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే.. అజర్ అరెస్టుపై తమకు అధికారిక సమాచారం అందలేదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. ఈ విషయంపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, విదేశాంగ శాఖ కార్యదర్శి జయశంకర్ లు ప్రధాని మోడీతో చర్చించారు. దేశ భద్రతకు ముప్పు ఏర్పడే పరిస్థితి వచ్చినప్పుడు… ఎదుర్కొనేందుకు సైన్యం పూర్తిస్థాయిలో సిద్దంగా ఉందన్నారు ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో 17 ఉగ్రవాద శిక్షణ శిబిరాలు క్రియాశీలకంగా కొనసాగుతున్నాయన్నారు. పఠాన్ కోట్ దాడిపై దర్యాప్తు చేస్తున్న NIA… ఉగ్రవాదులు వదిలి వెళ్లిన వాహనం దగ్గర్లో ఓ వైర్ లెస్ సెట్ ను స్వాధీనం చేసుకుంది. అది మేడిన్ చైనా అని గుర్తించి… ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఇక గురుదాస్ పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్ ను వరుసగా మూడోరోజూ ప్రశ్నించింది NIA. ఇక రేపట్నుంచి జరగాల్సిన భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలపై ఇంకా క్లారిటీ రాలేదు. నిన్న మోడీ-సుష్మా భేటీలోనూ… దీనిపై నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అవసరమైతే… ఇవాళ మరోసారి కలసి… చర్చల ప్రక్రియ ఉండాలా వద్దా అనేదానిపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy