ఉత్తమ అత్తకు నిదర్శనం : కొడుకును కాదని కోడలి కోసం పోరాటం

atta-kodaluఅత్తలేని కోడలు ఉత్తమురాలు ఓయమ్మో.. కోడల్లేని అత్త గుణవంతురాలు అన్నారో సినీకవి. అత్తాకోడళ్లు కలిస్తే యుద్ధమే వస్తుందనేది ఆ కవి అభిమతం. అలాంటిది.. కన్నతల్లిని మరిపించేలా కోడలిని అత్తగారు చూసుకుంటే? తన కొడుకు దాష్టీకాల నుంచి ఆమెకు రక్షణగా నిలిస్తే? ఏకంగా కొడుకు నుంచే రూ.4 కోట్ల భరణాన్ని కోడలికి కోర్టు నుంచి ఇప్పించగలిగితే? ఇది రీల్‌ లైఫ్‌లోనే కాదు.. రియల్‌ లైఫ్‌లోనూ సాధ్యమేనని నిరూపించింది బెంగళూరులోని ఓ అత్తగారు.

బెంగుళూరుకు చెందిన దేవానంద్‌ శివశంకరప్ప వ్యాపారవేత్త. కర్ణాటక మాజీ మంత్రి, దివంగత ఎస్‌ఆర్‌ కాశప్ప కొడుకు ఆయన. 2011లో శివశంకరప్ప తన మేనకోడలును పెళ్లాడాడు. కాపురంలో వచ్చిన కలహాల వల్ల 2012 నుంచి వారు వేర్వేరుగా ఉంటున్నారు. తనకు భర్త నుంచి విడాకులు ఇప్పించాలని 2015లో ఆమె కోర్టును ఆశ్రయించింది. భర్త నుంచి తనకు రూ.4.85 కోట్లు భరణంగా ఇప్పించాలని కూడా ఆమె కోర్టును అభ్యర్థించింది. ఈ మేరకు ఆమె భర్త శివశంకరప్పకు కోర్టు నోటీసులు పంపింది. ఈ కేసులో శివశంకరప్ప తల్లి, పిటిషనర్‌కు మద్దతుగా కోర్టులో సాక్ష్యం చెప్పింది.

తన కోడలి పట్ల కుమారుడి ప్రవర్తన బాగోలేదని ఆమె కోర్టులో కుండబద్దలు కొట్టింది. పైగా తన కొడుకు రెండో పెళ్లి చేసుకున్నాడని, వారికి ఓ కొడుకు కూడా ఉన్నాడని చెప్పింది. కోడలు అడిగిన భరణాన్ని తన కొడుకు నుంచి ఇప్పించాలని కోర్టును కోరిందామె. ఈ కేసులో ఆమె సాక్ష్యమే కీలకమైంది. దీంతో భార్యాభర్తలకు విడాకులు మంజూరు చేయడమే కాదు.. అత్త అభ్యర్థన మేరకు 60రోజుల్లోగా బాధితురాలికి 4 కోట్ల భరణాన్ని చెల్లించాలని శివశంకరప్పను ఆదేశించింది కోర్టు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy