ఉత్తరాఖండ్ లో వరదలు : కొట్టుకుపోయిన బస్సు

rain-uttarakandఉత్తరాఖండ్ లో ఓ బస్సు ప్రయాణికులను టెన్షన్ పెట్టింది. బాగేశ్వర్ దగ్గర.. అటవీ ప్రాంతం నుంచి వెళ్తున్న బస్సు.. ఒక్కసారిగ లోయలోకి జారిపోయింది. కుండపోత వర్షాలకు కొండ ప్రాంతాల్లోని రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో ఈ రోడ్డుపై వెళుతున్న ఓ బస్సు వెళుతూ వెళుతూ లోయలోకి జాయిపోయింది. రోడ్డుపై నుంచి 100 అడుగుల వరకు లోయలోకి మట్టితో జారిపోయింది. ఓ పెద్ద చెట్టు అడ్డం రావటంతో బతికిపోయారు అందులోని 20 మంది ప్రయాణికులు. స్థానికులు తాళ్ల సహాయంతో బయటకు తీసుకొచ్చారు.

ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు

వరదలకు ఉత్తరాఖండ్ విలవిల్లాడుతున్నది. గంగోత్రి నది డేంజర్ లెవల్ దాటి ప్రవహిస్తున్నది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు.. రిషికేశ్, డెహ్రాడూన్ దగ్గర నదులు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు తెగిపోవడంతో.. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఓ జీపులోని 13 మందిని స్థానికులు కాపాడారు. బైకులు, స్కూటర్లపై వెళ్తూ.. వరద ప్రవాహంలో కొట్టుకుని పోతున్నవారిని కూడా రక్షించారు. కొండచరియలు విరిగిపడటంతో 58వ నేషనల్ హైవే మొత్తం బ్లాక్ అయ్యింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. NDRF టీమ్స్ ఉత్తరాఖండ్ లో వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy