ఉత్తరాఖండ్ లో వలస పక్షుల ‘సందడి’

ganga-birdsరామ్ నగర్ ….ఉత్తరాఖండ్ లోని  ఓ  మామూలు  టౌన్. నిన్న మొన్నటి  దాకా  ఈ  టౌన్   ఎవరికీ తెలియదు. అయితే,  ఇప్పుడు సీన్ మారింది. వలస పక్షల కారణంగా రామ్ నగర్  టౌన్….అందరికీ  నోటెడ్ అయిపోయింది. రివ్వున  ఎగిరే ఈ  పక్షులు…..అక్కడివి కావు.  నాన్ లోకల్.  టోటల్లీ  ఫారిన్  బర్డ్స్.  సైబీరియా  నుంచి  వచ్చిన  వలస  పక్షులు. ఈ  మైగ్రేటరీ బర్డ్స్  ..లోకల్స్ ను బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. పని కట్టుకుని మరీ…..వచ్చి   వీటిని చూసి….ఎంజాయ్  చేస్తున్నారు అక్కడి లోకల్స్.

సైబీరియా నుంచి వచ్చే  ఈ  మైగ్రేటరీ  బర్డ్స్  అన్నీ….ఒకే  కలర్ లో ఉండవు.  బ్లాక్…వైట్…..బ్రౌన్ ….ఇలా  రకరకాల రంగుల్లో ఉంటాయి.  రామ్ నగర్  జనానికి  కనువిందు చేస్తాయి. కలర్ లోనే కాదు…మిగతా  వాటిల్లో  కూడా   సైబీరియా  పక్షుల్లో  తేడాలుంటాయి. దాదాపు  పది హేను  రకాల  సైబీరియా  పక్షులు….ప్రతి ఏడాది  రామ్  నగర్ ప్రజలకు  హాయ్  చెప్పడానికి  వస్తాయి. రామ్ నగర్ ప్రజలకు హాయ్  చెప్పడానికి…. ప్రతి ఏడాది  సైబీరియా పక్షులు ….సరదాగా  ఓ ట్రిప్ వేస్తాయి. అలా అని……  ఎప్పుడు  పడితే….అప్పుడు  రావు  సైబీరియా  పక్షులు.  రామ్ నగర్ కు రావడానికి   ఓ లెక్కుంది.  చలికాలం మొదలవగానే…..రయ్యిమంటూ  వచ్చి…. చలో  రామ్ నగర్  అంటూ  బయల్దేరతాయి. వింటర్  సీజన్  …..అలా  పూర్తయిందో ….లేదో…..తుర్రుమంటూ…..మళ్లీ  సైబీరియాకు  రిటర్న్ ట్రిప్  వేస్తాయి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy