ఉత్తరాఖాండ్ లో బస్సు బోల్తా.. 13 మంది మృతి

busఉత్తరాఖండ్‌లో మంగళవారం (మార్చి-13) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతిచెందారు. మంగళవారం ఉదయం అల్మోరా ప్రాంతం నుంచి నైనిటాల్‌ జిల్లాలోని రామ్‌నగర్‌కు వెళ్తున్న ఓ ప్రయాణికుల బస్సు తోటమ్‌ సమీపంలో లోయలో పడిపోయింది.

సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్‌ సహా 24 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెప్పారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy