ఉత్తర్ ప్రదేశ్ లో రైలు ప్రమాదం

meerut-lucknowఉత్తర్ ప్రదేశ్‌లో రైలు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం మీరట్‌- లక్నో రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 10 మందికి పైగా గాయపడ్డారు. రాంపూర్‌, ముందపండా స్టేషన్ మధ్యలో ఉన్న బ్రిడ్జి సమీపంలో రైలు.. ఎనిమిది బోగీలు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి తీవ్రగాయాలు కాలేదని ఉత్తర రైల్వే సీపీఆర్‌ఓ వెల్లడించారు. సహయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రమాదంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైలు ప్రమాదంలో గాయపడిన వారికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నష్టపరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 25 వేలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. రైలు ప్రమాదం ఘటనపై విచారణకు ఆదేశించారు రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy