ఉద్యమ శిఖరం ‘కాకా’

venkata swamyఆయనకు పేదల కష్టం తెలుసు. కార్మికుడి శ్రమ తెలుసు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఏది కావాలో తెలుసు. అందుకే తన జీవితంలో నిరంతరం వారి కోసమే… పోరాడారు. ఆయనే ప్రజలంతా కాకా అని ఆత్మీయంగా పిలుచుకునే… గడ్డం వెంకటస్వామి. చిన్న వయసు నుంచి చివరి శ్వాస విడిచే వరకూ… తెలంగాణ కోసమే పాటు పడిన మహా నేత. ఎంత ఎత్తు ఎదిగినా…. పేదవాడి కోసమే ఆరాటపడిన… కార్మికుడు. దళితులను.. ఊరి చివర నుంచి ఊరి మధ్యకు తీసుకొచ్చిన దళిత నేత కాకా. డిసెంబర్ 22, ఆయన వర్ధంతి సందర్భంగా… పోరాట యోధుడిపై స్పెషల్ స్టోరీ.

నీడలేని వారికి నీడకల్పించి…బతుకుపై భరోసా కల్పించిన పేదలపెన్నిధి కాకా. చిన్న వయసు నుంచీ చివరి క్షణం వరకూ… ఆయన జీవితంలో అన్నీ పోరాటాలే. సొంత పార్టీలో ఉంటూనే… తెలంగాణా వచ్చేదాకా..పోరాటం చేసిన… నాయకుడు ఆయన. తెలంగాణ ఉద్యమాలన్నింటిలో… పాల్గొన్న ఏకైక నాయకుడు కూడా ఆయనే. పోరాటమే ఊపిరిగా సాగిన కాకా జీవితంలో… మలుపులు…గెలుపులూ.. ఎన్నో.

హైదరాబాద్ లో బూర్గుల రామకృష్ణారావు సీఎంగా ఉన్న సమయంలో…ఆంధ్రా, తెలంగాణా ఉద్యోగుల మధ్య సంఘర్షణ మొదలైంది. దాంతో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికేతరుల పెత్తనానికి వ్యతిరేకంగా.. గైర్ ముల్కీ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉధ్యమంలో ఎందరో తెలంగాణా నేతలు…పాల్గొన్నారు. వారందరికంటే చిన్నవారు…కాకానే. ఉద్యమం ఉధృత స్థాయికి చేరబోతున్న సమయంలో… హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్రం విలీనం జరిగిపోయింది. నాటి గైర్ ముల్కీ ఉద్యమమే..1969 తెలంగాణా ఉద్యమానికి పునాది అయింది.

1969 ఉద్యమం…

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వెన్నులో దడ పుట్టించిన మహా ఉద్యమం.

తెలంగాణ రావాలని…ఆరాటం..

పార్టీలకతీతంగా పోరాటం…

ఎక్కడ విన్నా…ఛల్ హట్ అంటూ…ముందుకు దూసుకొచ్చే లక్షలాదిమంది జనం.

ఎక్కడ చూసినా…బ్యారిగేడ్లు, ముళ్ల కంచెలు, ఖాఖీల జులుం..

అంతా…యుద్ద భీభత్సం.

తెలంగాణా ఉద్యమాల నుదుట మీద…ప్రజల రక్తాన్ని…మొదటి సారి వీర తిలకం దిద్దిన ఉద్యమం ఇది. ఈ ఉద్యమంలో గడ్డం వెంకటస్వామి..కీలక పాత్ర పోషించారు. న్యాయం కోసం… ధర్నాలు చేస్తున్న విద్యార్ధులపై పోలీసులు.. విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ విషయం తెలియగానే… అప్పటికి ఎమ్ పీ గా ఉన్న కాకా… ఉద్యమంలో పాల్గొన్నారు. రాజకీయాలను వదిలి…పోరాటంలో చేరారు. విద్యార్ధులకు అండగా నిలిచారు. ఈ పోరాటంలో..ముషీరాబాద్ జైలు దగ్గర జరిగిన కాల్పుల్లో…బులెట్ దెబ్బతిని తీవ్రంగా గాయపడ్డారు…గడ్డం వెంకటస్వామి.

1969 ఉద్యమం..అటు ప్రభుత్వాలు ఇటు ప్రజలపైన ఎంతో ప్రభావం చూపించింది. కాకా కాంగ్రెస్ ను వదిలి బయటకు రావడంతో…ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి నుంచి ఎంపీగా గెలిచారు. ఈ ఎన్నికల్లో కేంద్రంలో హంగ్ వస్తే..తెలంగాణా ఇచ్చే కండిషన్ తో కాంగ్రెస్కు మద్దతివ్వొచ్చని టీపీఎస్ భావించింది. కానీ కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీ రావడంతో…. అనివార్యంగా.. టీపీఎస్ కూడా అందులోనే విలీనమైంది.

కాంగ్రెస్ లో ఉంటూ….తెలంగాణ నినాదాన్నే ప్రతి క్షణం కలవరించిన…ఏకైక లీడర్.. కాకా. చివరకు సీడబ్లుసీ భేటీ జరుగుతుంటే…జై తెలంగాణ అని చెప్పిన…ఏకైక నాయకుడు కూడా ఆయనే. ఆయన ప్రయత్నాలతోనే రాష్ట్రాల ఏర్పాటుపై రెండో ఎస్సార్సీ ఏర్పాటు చేయాలన్న మొదట్లో… సీడబ్లుసీ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా తెలంగాణ లక్ష్యంతో ఢిల్లీకి ఎవరొచ్చినా…అండగా నిలిచి, సహాయ సహకారాలు అందించేవారు…గడ్డం వెంకటస్వామి.

1969 నుండి 2004 వరకూ తెలంగాణ సాధనలో కాకా పాత్ర ఒకెత్తు. 2004 ఎన్నికల తర్వాత మరో ఎత్తు. ఎన్నికల్లో…తెలంగాణ సెంట్ మెంట్ బలం తెలియాలనే ఉద్దేశంతో… టీఆర్ఎస్…కాంగ్రెలకు మధ్య పొత్తు కుదిర్చారు. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిస్థాయిలో తెలంగాణ ఏర్పాటుకు హామీ ఇచ్చింది. చివరకు గతేడాది.. ప్రత్యేక తెలంగాణా సాకారమైంది. ఆఖరి క్షణం వరకూ జై తెలంగాణా అంటూ..పోరాడిన కాక… ప్రత్యేక తెలంగాణా చూసిన తర్వాత…2014, డిసెంబర్ 22 వ తేదీన కన్నుమూశారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy