ఉద్యోగం కావాలంటే  పోస్టాఫీసుకు వెళ్లండి

post-officeఅన్ని విధాల అర్హతలున్న అభ్యర్థులను ఎంపిక చేసుకునేందుకు ఆయా సంస్థలు విద్యార్ధుల దగ్గరకే వెళ్లి క్యాంపస్ ఇంటర్వ్యూలు  నిర్వహించి సెలక్ట్ చేసుకునే వారు. అంతకు ముందు నిరుద్యోగ యువత ఎంప్లాయ్ మెంట్ ఎక్సెంజీల్లో పేర్లు నమోదు చేసుకునే వాళ్లు. పదో తరగతి మొదలు వివిధ దశల్లో చదువు పూర్తి చేసుకున్నవారు వీటిల్లో వివరాలు నమోదు చేసు కోవడం ఆనవాయితీగా వస్తోంది. దీని ద్వారా ఉద్యోగావకాశాలు కలిగేదీ, లేనిదీ ఎవరికీ సమాచారం ఉండదు. కానీ దీన్ని పూర్తిగా మారు స్తూ నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌(ఎన్‌సీఎస్‌) పథకాన్ని కేంద్రంఅందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు దీన్ని పోస్టాఫీసు కార్యాలయాలతో అనుసంధానిస్తూ కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తా త్రేయ, భారత తపాలా శాఖ కార్యదర్శి బి.వి. సుధాకర్‌ సమక్షంలో 2 శాఖలు ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ప్రధాన తపాలా కార్యా లయంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. కాగా, దీన్ని ప్రయోగాత్మకంగా మొదట హైదరాబాద్‌ నుంచి ప్రారంభించనున్నారు.

ఉద్యోగార్థులు తమ వివరాలను సమీపంలోని ఎన్‌సీఎస్‌ సెంటర్స్‌ ఉన్న తపాలా కార్యాలయా లకు వెళ్లి అక్కడి కేంద్రంలో వివరాలను నమోదు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లోనే వాటిని పొందుపరుచుకునే వెసులుబాటు ఉంటుంది. నమోదైన వివరాలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చేరుతాయి. తమకు అవసరమైన అభ్యర్థుల ఎంపిక కోసం అవి జాబ్‌మేళాలు ఏర్పాటు చేస్తాయి. ఆ సమాచారం అభ్యర్థులకు చేరుతుంది. అక్కడ నేరుగా ఆయా సంస్థలు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ, తపాలాశాఖలు సంయుక్తంగా చేపట్టనున్న ఈ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించనున్నారు.

7 Responses to ఉద్యోగం కావాలంటే  పోస్టాఫీసుకు వెళ్లండి

 1. K MANJUNATH says:

  super

 2. Anonymous says:

  how to online resistration sir?

 3. Avinash Sabbithi says:

  ya its better and easy

 4. Zareena says:

  I need a job

 5. Rathod. Sanjay says:

  I need a job ya its a better and easy

 6. Rathod. Sanjay says:

  How to online resistration sir

 7. Anonymous says:

  How to register to this

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy