ఉద్యోగ,ఉపాధ్యాయ,ఆర్టీసీ కార్మిక సంఘాలతో రేపు సీఎం భేటీ

cmkcr2204ఉద్యోగ , ఉపాధ్యాయ, ఆర్టీసీ కార్మిక సంఘాలతో బుధవారం(మే-16) భేటీ కానున్నారు CM KCR. మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్లో జరగనున్న మీటింగ్ లో ఉద్యోగుల డిమాండ్లు, పరిష్కారాలపై మాట్లాడనున్నారు. భేటీ తర్వాత కేసీఆర్ లేదా ఆయన కార్యాయలం ప్రకటన చేసే అవకాశం ఉంది. సీఎం నేరుగా తమతో చర్చించనుండడంతో  డిమాండ్లు పరిష్కారమవుతాయనే ఆశతో ఉన్నారు  ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు.

రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, RTC కార్మిక సంఘాల సమస్యల పరిష్కారంపై మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలోని సబ్ కమిటీ చర్చలు జరిపింది. ఉద్యోగ, ఉపాధ్యాయ , సంఘాలతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకుంది. ఇప్పటికే ముఖ్యమంత్రికి సబ్ కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టర్ లపై CS SK జోషి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు,  జీఏడీ, న్యాయ, ఇతర శాఖల అధికారులతో చర్చించారు ముఖ్యమంత్రి . ఏయే  సమస్యలు పరిష్కంచగలం , సర్కార్ పై ఎంత భారం పడుతుంది ,న్యాయపరమైన చిక్కులు ఉన్నాయా అనే అంశాలపై అభిప్రాయం తీసుకున్నారు సీఎం. రేపటి(బుధవారం) సమావేశంలో ఉద్యోగుల డిమాండ్లపై చర్చించనున్నారు కేసీఆర్. ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకోనున్న సీఎం… తర్వాత సమస్యల పరిష్కారంపై ప్రకటన చేసే అవకాశముంది.

ఉద్యోగులు కూడా తమ సమస్యలు పరిష్కారవుతాయనే ఆశగా ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 43 శాతం ఫిట్మెంట్ మాత్రమే  ప్రభుత్వం ఇచ్చిందని… ఇంకా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.  మొత్తం 18 డిమాండ్లను సర్కార్ ముందుంచారు  ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు. అధికారులతో చర్చించిన సీఎం ఉద్యోగుల సమస్యల సానుకూల ప్రకటన చేస్తారన్న నమ్మకంతో ఉన్నారు ఉద్యోగులు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy