ఉద్యోగాల కల్పనలో బీజేపీ ప్రభుత్వం విఫలం: చిదంబరం

CHIDAMBARAMఎన్డీయే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ కారణంగా వ్యాపారులు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారన్నారు.  పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగితే ప్రభుత్వం పట్టించుకోకుండా ఆ ధరల తగ్గింపును రాష్ట్రాల మీదకు నెట్టడం సమంజసం కాదన్నారు..

పెట్రోల్‌, డీజిల్‌ను GST పరిధిలోకి తీసుకొస్తే తప్పకుండా ధరలు తగ్గుతాయన్నారు. కేంద్రంతో పాటు చాలా రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉందన్న  చిదంబరం …అలాంటపుడు పెట్రోల్‌ ధరల పెరుగుదలపై రాష్ట్రాలను ఎందుకు నిందిస్తున్నారన్నారు. వాళ్లకు అధిక రాష్ట్రాల్లో మెజారిటీ ఉంది కాబట్టి ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. రైతులు తమ పంటకు సరైన గిట్టుబాటు ధర అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, యువతకు ఉద్యోగాలు కల్పించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందన్నారు.

ప్రైవేటు పెట్టబడులు తగ్గిపోవడంతో …గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినా ఉద్యోగాలు దొరకడం లేదని యువతకు అర్థమైందని… అందుకే వాళ్లు పకోడి అమ్ముకునే పనిని కూడా ఉద్యోగమనే అనుకుంటున్నారన్నారు చిదంబరం. ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy