ఉన్నత విద్యామండలి వివాదంపై కేంద్రం స్పష్టత

Home-Ministryతెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న ఉన్నత విద్యా మండలి వ్యవహారంపై కేంద్ర హోంశాఖ తన నిర్ణయాన్ని ప్రకటించింది. స్థిర, చర ఆస్తులు ఎక్కడ ఉంటే ఆ రాష్ట్రానికే చెందుతాయని స్పష్టం చేసింది.

విభజన చట్టంలోని సెక్షన్‌ 49 ప్రకారం జనాభా ఆధారంగా 58:42 నిష్పత్తిలో డబ్బును పంచుకోవాలని హోంశాఖ చెప్పింది.

ఉద్యోగులు ఎక్కడ పనిచేస్తుంటే.. అక్కడే కొనసాగాలని సూచించింది. ఉన్నత విద్యామండలి వ్యవహారంపై గతేడాది మార్చి 18న సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించగా.. ఈ తీర్పును అమలు పరిచేందుకు కేంద్ర హోంశాఖ రెండు రాష్ట్రాల అధికారులతో విస్తృతంగా చర్చలు జరిపింది. ఈ మేరకు తుది నిర్ణయం వెల్లడించింది హోంశాఖ.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy