ఉన్మాదం: ప్రేమించట్లేదని.. యాసిడ్ పోశాడు

begum-acidహైదరాబాద్ పేట్ బషీరాబాద్ పరిధిలో రాత్రి ఓ యువతి మీద యాసిడ్ దాడి జరిగింది. దత్తాత్రేయనగర్ లో ఫరీదా బేగంపై ప్రదీప్ యాసిడ్ పోశాడు. దీంతో యువతికి మోహం కాలింది. ఆమెకు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడ్ని పట్టుకోవడానికి 6 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు.  సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. కుత్బుల్లాపూర్‌లోని దత్తత్రేయనగర్‌లో నివసించే ఫరీదా బేగం (17) సుభాష్‌నగర్‌లోని ఓ ఫ్యాన్ల కంపెనీలో పనిచేస్తోంది. షాపూర్‌నగర్‌ కళావతినగర్‌కు చెందిన ప్రదీప్‌ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడుతున్నాడు. ఇందుకు ఫరీదా ససేమిరా అనడంతో కక్ష పెంచుకున్నాడు. సోమవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఏదో మాట్లాడాలంటూ ఫోన్‌ చేసి ఇంటి బయటికి రమ్మన్నాడు. ఆమె బయటికి రాగానే.. తన వెంట తెచ్చిన యాసిడ్‌ను ఖబీరాబేగం ముఖంపై చల్లి పరారయ్యాడు. దీనిపై స్థానికులు సమాచారమివ్వడంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. 40% కాలినగాయాలైన బాధితురాలిని సురారం మల్లారెడ్డి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు కాంటినెంటల్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. ప్రదీప్‌ను పట్టుకునేందుకు 6 బృందాలతో గాలింపు చేపట్టారు. అతడి ఫోన్‌ నంబర్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy