ఉన‌ద్క‌త్ హ్యాట్రిక్…ఉప్పల్లో స‌న్ రైజ‌ర్స్‌కు తొలి ఓట‌మి

maఉప్ప‌ల్ స్టేడియంలో స‌న్‌రైజ‌ర్స్ తొలి ఓట‌మిని చ‌విచూసింది.పూణే విధించిన 149 ప‌రుగుల ర‌న్స్‌ను చేధించే క్ర‌మంలో వార్న‌ర్ సేన త‌డ‌బ‌డింది. కెప్టెన్ వార్న‌ర్, యువ‌రాజ్ సింగ్ మిన‌హా జ‌ట్టులో ఎవ‌రూ బ్యాట్‌తో ఆదుకోలేక పోయారు. ఫ‌లితంగా పూణే 12 ప‌రుగుల‌తో విజ‌యం సాధించింది. దీంతో పూణే తో ఆడిన రెండు మ్యాచుల్లో హైద‌రాబాద్ ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది. శిఖ‌ర్ ధ‌వ‌న్‌(19)స్టోక్స్ ఆదిలోనే దెబ్బ‌తీయ‌గా వ‌న్ డౌన్‌లో వ‌చ్చిన విలియ‌మ్‌స‌న్ అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన యువ‌రాజ్ సింగ్  వార్న‌ర్‌తో క‌లిసి  స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశాడు. ఇద్దరు ఆడుతున్న స‌మ‌యంలో మ్యాచ్ స‌న్‌రైజ‌ర్స్ వైపే ఉన్నింది. ఇదే స‌మ‌యంలో వార్న‌ర్‌(40)ను స్టోక్స్ ఔట్ చేసి మ‌రోసారి దెబ్బ తీశాడు.

హెన్రిక్స్ కూడా పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌నే ఇచ్చాడు. ఇక లాభం లేద‌నుకున్న యువ‌రాజ్ సింగ్ త‌న బ్యాట్‌కు ప‌నిచెప్పాడు. భారీ షాట్లు కొడుతూ మ‌ళ్లీ ఊపు తెచ్చిన‌ప్ప‌టికీ… ఉన‌ద్క‌త్ అడ్డుక‌ట్ట వేశాడు. 43 బంతుల్లో 47 ప‌రుగులు చేసి యువ‌రాజ్ ఔట్ అవ‌డంతో పూణే జ‌ట్టులో ఆశ‌లు చిగురించాయి. అనంత‌రం వ‌చ్చిన బ్యాట్స్‌మెన్‌ను హ్యాట్రిక్ వికెట్లు తీసి ఉన‌ద్క‌త్ పూణేకు విజ‌యం అందించిపెట్టాడు.

అంత‌కుముందు వార్న‌ర్ సేన టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన పూణేకు ఆదిలోనే పెద్డ దెబ్బ త‌గిలింది. సూప‌ర్ ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ త్రిపాఠి ఒక్క ప‌రుగుకే ర‌నౌట్ అయ్యాడు. మ‌రో ఓపెన‌ర్  ర‌హానే కూడా 22 ప‌రుగుల‌కే ఔట‌య్యాడు. అనంతరం బ‌రిలోకి దిగిన కెప్టెన్ స్టీవ్ స్మిత్  బెన్ స్టోక్స్ స్కోరు బోర్డులో వేగం పెంచారు. స్టీవ్ స్మిత్ క్యాచ్‌ను బిపుల్ శ‌ర్మ జార‌విడిచాడు. స్టోక్స్ కూడా చ‌క్క‌ని షాట్లు కొడుతూ ఆక‌ట్టుకున్నాడు. 25 బంతుల్లో 39 ప‌రుగులు చేసిన స్టోక్స్ ర‌షీద్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. నాలుగు ప‌రుగుల వ్య‌వ‌ధిలోనే స్టీవ్ స్మిత్‌ను కౌల్ ఔట్ చేశాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన డేనియ‌ల్ క్రిస్టియ‌న్ కూడా కౌల్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు.

ఇక స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లే బాధ్య‌త ధోనీ తీసుకున్నాడు. భువ‌నేశ్వ‌ర్ వేసిన 19 ఓవ‌ర్లో ఒక ఫోరు రెండు సిక్స్ లు బాదాడు. ప‌రుగులు రాబ‌ట్టే క్ర‌మంలో మ‌నోజ్ తివారి (9) 19వ ఓవ‌ర్లో ర‌నౌట్ అయ్యాడు. ఊపు మీద క‌నిపించిన ధోని (31) కౌల్ బౌలింగ్‌లో వికెట్ కీప‌ర్ న‌మాన్ ఓజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ త‌ర్వాత శార్దుల్ ఠాకూర్‌ను కూడా కౌల్ ఔట్ చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్లో పూణే జ‌ట్టు 8 వికెట్లు కోల్పోయి 148 ప‌రుగులు చేసింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy