ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సర్వం సిద్ధం

Vice-Presidential-election-Naidu-Gandhiకొత్త ఉప రాష్ట్రపతి ఎవరో.. శనివారం(ఆగస్ట్ 5) తేలిపోనుంది. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలకు.. ఏర్పాట్లన్ని పూర్తయ్యాయి. ఎన్డీయే నుంచి వెంకయ్యనాయుడు.. కాంగ్రెస్, ఇతర విపక్షాల నుంచి మహాత్మా గాంధీ మనవడు.. గోపాలకృష్ణ గాంధీ పోటీ చేస్తున్నారు. వెంకయ్యకు.. ఎన్డీయే పక్షాలతో పాటు.. ప్రాంతీయ పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయి. టీఆర్ఎస్, వైసీపీ, అన్నాడీఎంకే లాంటి పార్టీలు అండగా నిలుస్తున్నాయి. అటు.. కాంగ్రెస్, ఇతర విపక్షాల అభ్యర్థికి.. ఎన్డీయేలో ఈ మధ్యనే చేరిన జేడీయూ.. మద్దతు ఇస్తామని చెప్పింది. ముందే ఇచ్చిన మాట ప్రకారం.. ఎన్డీయేలో ఉన్నా కూడా.. ప్రతిపక్షాల అభ్యర్థి అయిన గోపాలకృష్ణకు సపోర్ట్ ఇస్తామని తేల్చింది.

ఇక.. రాష్ట్రపతి ఎన్నికలతో పోలిస్తే.. ఉప రాష్ట్రపతి ఎన్నికకు.. కొద్దిగా తేడాలున్నాయి. ప్రెసిడెంట్ ఎన్నికలలో పార్లమెంట్ ఎంపీలతో పాటు.. ఎమ్మెల్యేలు కూడ.. ఓటేస్తారు. కాని.. ఉప రాష్ట్రపతి ఎన్నికలలో.. లోక్ సభ, రాజ్యసభ ఎంపీలే ఓటేస్తారు. పోలింగ్ కూడ.. పార్లమెంట్ లోనే అవుతుంది. శనివారం పోలింగ్ జరుగుతుంది.. ఫలితం కూడ అదే రోజు వెల్లడవుతుంది. రాష్ట్రపతి ఎన్నికలలో.. ఒక్కో ఎంపీకి.. ఒక్కో ఎమ్మెల్యేకి జనాభా లెక్కల ప్రకారం.. ఓటు విలువ ఉంటుంది. పడ్డ ఓట్లను లెక్కేసి.. ఆ ఓట్లకు ఉన్న విలువను బట్టి.. రాష్ట్రపతిని ఎన్నిక చేస్తారు. కాని.. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు లెక్కలు ఉండవు. ఒక ఎంపీకి.. ఒక ఓటు విలువ లెక్కన.. మొత్తం పోలైన ఓట్లను లెక్కపెడ్తారు. పోలింగ్ అయిపోయిన  కాసేపటికి కొత్త ఉప రాష్ట్రపతి ఎవరో ప్రకటిస్తారు.

లోక్ సభలో 545.. రాజ్యసభలో 245 స్థానాలు కలిపి.. పార్లమెంట్ లో మొత్తంగా 790 సీట్లున్నాయి. ఇందులో ఉన్న ఎంపీలంతా రేపు ఓటేయనున్నారు. బలాబలాల ఆధారంగా.. ఎన్డీయే అభ్యర్థి వెంకయ్య నాయుడు.. మూడింట రెండొంతుల మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. ఆగస్టు పదిన ఇప్పటి ఉప రాష్ట్రపతి టర్మ్ పూర్తవుతుంది. కొత్త ఉప రాష్ట్రపతి 11న బాధ్యతలు తీసుకుంటారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy