ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు

rainsదక్షిణ కర్ణాటక నుంచి తమిళనాడు వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఇవాళ తెలంగాణలోని పలుచోట్ల ఓ మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఈ నెల రెండో వారం నుంచి రాష్ట్రంలో వర్షాలు క్రమంగా పుంజుకుంటాయని చెపుతున్నారు వాతావరణ కేంద్రం అధికారి రాజారావు. నిన్న(గురువారం) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు కురిశాయి. హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి రోడ్డన్ని జలమయమయ్యాయి.ఆదిలాబాద్‌లోని పలు ప్రాంతాల్లో 2 సెం.మీటర్ల, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్, ఆసిఫాబాద్‌ల్లో ఒక్కో సెం.మీ.చొప్పున వర్షం కురిసిందని అధికారులు చెపుతున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy