ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

sarvepalli-radhakrishnanఅజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి విజ్ఞానాన్ని ఇచ్చే వ్యక్తి గురువు. అందుకే జీవితంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే. మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్యదేవో భవ అని అందుకే అంటారు. ఇవాళ టీచర్స్ డే సందర్భంగా గురువు గొప్పదనంపై ప్రత్యేక కథనం.

తల్లి జన్మనిస్తుంది. తండ్రి ఆలనా పాలనా చూస్తాడు. కానీ విజ్ఞానపరంగా జన్మనిచ్చేది మాత్రం గురువే. తన మేధస్సును మన మనస్సులోకి చొప్పించి… ఓ అద్భుతమైన శక్తిగా మలుస్తాడు. సమాజంలో గొప్ప వ్యక్తిగా నిలబెడతాడు గురువు.

గురువును దైవంతో సమానంగా భావిస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో  పోల్చుతారు. అంతే గొప్పగా పూజిస్తారు. నాటి పురాణాల నుంచి నేటి వరకు విద్యావ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా.. గురువుకున్న స్థానం ఈ సృష్టి ఉన్నన్ని రోజులుగా అలాగే ఉంటుంది.

మనిషి ఖ్యాతి ఖండాంతరాలు దాటుతోంది. కానీ.. దానికి తొలి అడుగు పడేది మాత్రం క్లాస్ రూమ్ లోనే. విద్యార్థికి పసివయసు నుంచే విద్యాబుద్ధులు నేర్పిస్తారు ఉపాధ్యాయుడు. వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడేది కూడా ఆయనే. విద్యలేని వాడు వింత పశువు అన్నారు పెద్దలు. అందుకే అనాగరికంలో పడకుండా.. నాగరికతను నేర్పి.. అర్థవంతమైన మార్గంలో నడిపించే గొప్ప వ్యక్తి గురువు. మానవ జీవితానికి మార్గదర్శనం చేసేది గురువే. చిన్నతనంలో వేలుపట్టి గురువు దిద్దించిన అక్షరాలే.. భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. జీవితంలో సాధించే ఎన్నో గొప్ప విజయాలకు ఆ ఓనమాలే తొలి మెట్లు.

బతకలేని బడిపంతులు అన్నా… ఆయన ఏనాడూ తన బాధ్యతను వీడిపోలేదు. బతికించేవాడు.. బతుకు నేర్పించేవాడు బడిపంతులు అని నిరూపిస్తూనే ఉన్నారు. విజ్ఞానదీపాలు వెలిగిస్తున్న గురువులందరికి  వీ6 తరుపున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy