ఉప్పల్ టెస్టులో భారత్ జయభేరి

KOHLI-TEAMఉప్పల్‌ టెస్టులో గ్రాండ్ విక్టరీ సాధించింది టీమిండియా. 208 పరుగుల భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 459 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగి.. 103/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఐదోరోజు ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్‌ మరో 147 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో శతకంతో ఆకట్టుకున్న కెప్టెన్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేసి ఔటయ్యాడు. మహ్మదుల్లా(64) ఒక్కడే చెప్పుకోతగ్గ స్కోర్ చేశాడు. పోరాడినప్పటికీ అతడికి సహకారం అందించే ఆటగాడు కరువయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌, జడేజా చెరో 4 వికెట్లు, ఇషాంత్ శర్మ 2 వికెట్లు తీశారు.

ఇండియా: 687/6d & 159/4d

ఫస్ట్ ఇన్నింగ్స్: రాహుల్(1), విజయ్(108), సీఏ పుజారా(83), కోహ్లి(204), రహానే(82), సాహా(106 నాటౌట్), అశ్విన్(34), జడేజా(60 నాటౌట్)

సెకండ్ ఇన్నింగ్: విజయ్(7), రాహుల్(10), పుజారా(54 నాటౌట్), కోహ్లీ(38), రహానే(28), జడేజా(16 నాటౌట్)

బంగ్లాదేశ్: 388 & 250

ఫస్ట్ ఇన్నింగ్స్: తమీమ్ ఇక్బాల్(24), సౌమ్య సర్కార్(15), మోమినుల్(12), మహ్మదుల్లా(28), షకీబ్ అల్ హసన్(82), ముషఫిర్ రహ్మన్(127), షబ్బీర్ రహ్మన్(16), మెహదీ హసన్(51), తయిజుల్(10), తస్కిన్(8), కమ్రుల్(0 నాటౌట్)

సెకండ్ ఇన్నింగ్స్:  తమిమ్(3), సౌమ్య సర్కార్(42), మోమినుల్(27), మహ్మదుల్లా(64), షకీబ్(22), ముషపీర్(23), షబ్బీర్(22), మెహది హసన్ మీర్జా(23), కమ్రుల్ హసన్(3 నాటౌట్), ఇస్లాం(6), తస్కిన్ అహ్మద్(1)

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy