ఉప్పల్ లోనే వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా…

12810మూడు మ్యాచ్ లలోనే సిరీస్ ఎవరిదో తేల్చేశారు టీమిండియా కుర్రాళ్లు. వరుసగా మూడు వన్డే మ్యాచ్ లలో గెలిచి సిరీస్ ను గెలిచారు. 6 వికెట్ల తేడాతో థర్డ్ వన్డేలో గెలిచారు. ఉప్పల్ వేదికగా లంక టీంను ఓడించారు. వాల్డ్ కప్ దగ్గర్లో ఉండగా వరస గెలుపులు టీంలో కాన్ఫిడెన్స్ ను పెంచాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక టీంను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు ఇండియా బౌలర్లు.  దిల్షాన్ 53 రన్స్ చేయగా, సంగక్కర డకౌట్ అయ్యాడు. జయవర్దనే ఒక్కడే సెంచరీ చేసి లంక టీంను ఆదుకున్నాడు. ఉమేష్ యాదవ్ 4, అక్షర్ పటేల్ 3, కులకర్ణి 1, అశ్విన్ 1, రాయుడు 1 వికెట్ తీశారు. లంక టీంను 242 రన్స్ కే ఆలౌట్ చేశారు. 243 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇండియా బ్యాట్స్ మెన్ ముందు నుంచి దూకుడుగానే ఆడారు. థావన్ 91, రాయుడు 35, కోహ్లీ 53 రన్స్ చేయడంతో 44.1 ఓవర్లలోనే టార్గెట్ ను రీచ్ అయింది. 135 ఇన్నింగ్స్ లలో 6 వేల రన్స్ చేసిన ఫాస్టెస్ట్ బ్యాట్స్ మెన్ గా కోహ్లీ రికార్డ్ క్రియేట్ చేశాడు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy