ఉప ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు : ఊహించని విధంగా ఆధిక్యాలు

By-poll-Results10 రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది. గంట గంటకు మారుతున్న ఆధిక్యాలు ఆసక్తి రేపుతున్నాయి. నాలుగు పార్లమెంట్ స్థానాల్లో ఉపఎన్నిక జరగ్గా.. మూడింటిలో బీజేపీ లీడ్ లో ఉంది. 10 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్, మిత్రపక్షాలు సత్తా చాటుతున్నాయి. ఫలితాలు ఇటు అధికార, విపక్ష పార్టీల్లో ఉత్కంఠను రేపుతున్నాయి.

నాలుగు పార్లమెంట్ స్థానాల్లో జరిగిన ఉపఎన్నికల ఫలితాల కౌంటింగ్ లో అందరి దృష్టి యూపీ రాష్ట్రం కైరానాపై పడింది. ఈ నియోజకవర్గంలో బీజేపీ, ఆర్ఎల్డీ పోటీపడ్డాయి. బీజేపీ అభ్యర్థిని ఓడించాలని విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి ఆర్ఎల్డీకి మద్దతు పలికాయి. దీంతో కైరానాలో ఆర్ఎల్డీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాల్గరో లోక్ సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి గోవిత్ దేద్య ఆధిక్యం కనపరుస్తున్నారు. మహారాష్ట్రలోని బాంద్రా- గోండియా పార్లమెంట్ స్థానంలో ఎన్సీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. నాగాలాండ్ లో బీజేపీ మిత్రపక్షం ఎన్డీపీపీ అభ్యర్థి ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు.

అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే.. కర్ణాటక రాజరాజేశ్వరినగర్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజార్టీ దిశగా ఆధిక్యం కనబరుస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని నూర్పూర్ నియోజకవర్గంలో ఎస్పీ అభ్యర్థి, మహేస్తల- పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ అభ్యర్థి ఆధిక్యం కనబరుస్తున్నారు. మొదటి నుంచి పాలస్ కడేగావ్ లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమైంది. కేరళలోని చెంగన్నూర్ లో సీపీఎం అభ్యర్థి,  షాకోట్ -పంజాబ్ లో కాంగ్రెస్ అభ్యర్థులు, బీహార్ లోని జోకిహట్ RJD అభ్యర్థి, జార్ఖండ్ లోని గోమియా, సిల్లిలో జేఎంఎం అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

లోక్ సభ స్థానాలు ఇలా ఉన్నాయి :

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం : కైరానా నియోజకవర్గం : RLD అభ్యర్థి 16వేల ఓట్ల ఆధిక్యం.

మహారాష్ట్ర రాష్ట్రం : పాల్గర్ నియోజకవర్గం : BJP అభ్యర్థి ఆధిక్యం

మహారాష్ట్ర రాష్ట్రం : బాంద్రా- గోండియా నియోజకవర్గం : NCP అభ్యర్థి ఆధిక్యం

నాగాలాండ్ రాష్ట్రం : నాగాలాండ్ నియోజకవర్గం : ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy