ఉప రాష్ట్రపతి నివాసంలో…రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కు ఫేర్ వెల్

vp ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసంలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ పీజే కురియన్‌ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. నేటితో డిప్యూటీ చైర్మన్ గా కురియన్ పదవీ కాలం ముగిసింది. ఈ వీడ్కోలు కార్యక్రమానికి కేంద్ర ఐటీ మంత్రి రవిశంకరప్రసాద్, రాజ్యసభలో కాంగ్రెస్ ప్రతిపక్షనేత గులాంనబీ ఆజాద్, సీపీఐ నేషనల్ సెక్రటరీ డి.రాజా, పలువురు నేతలు హాజరయ్యారు. డిప్యూటీ చైర్మన్ గా ప్రజాస్వామ్యాన్ని కురియన్ కాపాడారన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. హౌస్ రూల్స్, ప్రొసీజర్స్ లో కురియన్ కు అధ్భుతమైన నాలెజ్డ్ ఉందని తెలిపారు. చైర్మన్ గా తాను భాధ్యతలను నిర్వహించేందుకు అనేక విలువైన సలహాలు కురియన్ ఇచ్చారని వెంకయ్యనాయుడు అన్నారు. ప్రొసీడింగ్స్ ను ప్యాషన్, ఎనర్జీతో కురియన్ నిర్వహించారన్నారు. కురియన్ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలన్నారు. కేరళకు చెందిన కురియన్‌ 2006 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2012 ఆగస్టు 21న ఆయన రాజ్యసభ్య డిప్యూటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ రెండిటి పదవీకాలం నేటితో ముగిసింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy