ఉమెన్స్ ఆసియా కప్ : టీమిండియా గ్రాండ్ విక్టరీ

INDఉమెన్స్ ఆసియా కప్ లో భాగంగా ఆదివారం (జూన్-3) మలేసియాతో జరిగిన ఫస్ట్ టీ20లో గ్రాండ్ విక్టరీ సాధించింది భారత్. మలేసియాలోని కౌలాలంపూర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 169 రన్స్ చేసింది హర్మన్ సేన.  ఓపెనర్‌ స్మృతీ మంధాన(2) నిరాశపరిచినా, మరో ఓపెనర్‌ మిథాలీ రాజ్‌(97 నాటౌట్‌; 69 బాల్స్ లో 13 ఫోర్లు, 1 సిక్సర్‌) చెలరేగి బ్యాటింగ్‌ చేశారు. హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌(32 ),   దీప్తి శర్మ(18) బ్యాట్‌ ఝుళిపించడంతో మలేసియాకు.. భారత జట్టు  170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మలేసియా 13.4 ఓవర్లలో 27 పరుగులకే ఆలౌటైంది. భారత మహిళలు చెలరేగి బౌలింగ్‌ చేయడంతో మలేసియా ఏ దశలోనూ కనీస పోటీ ఇవ్వలేకుండా వరుస వికెట్లను చేజార్చుకుని ఘోర ఓటమి పాలైంది. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్‌ మూడు వికెట్లతో రాణించగా, అనుజా పటేల్‌, పూనమ్‌ యాదవ్‌ తలో రెండు వికెట్లతో మెరిశారు. శిఖా పాండేకు వికెట్‌కు వికెట్‌ దక్కింది. మలేసియా మహిళల్లో సషా ఆజ్మీ(9)దే అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా, ఆరుగురు డకౌట్ అయ్యారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy