ఉమెన్స్ టీ20: జట్టుకు ఎంపికైన ఖమ్మం యువతి

KMMచండీగ‌ఢ్‌లో ఈ నెల 21 నుంచి జరగనున్న మహిళా టీ-20 క్రికెట్ జట్టుకు ఖమ్మం జిల్లా యువతి చోటు దక్కించుకుంది. జిల్లాలోని కూసుమంచి మండలం గంగబండతండా పరిధిలోని హేమ్లాతండాకు చెందిన నిరుపేద గిరిజన యువతి వడ్త్యి వినోద. అంచలంచెలుగా ఎదిగి అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ పోటీలకు ఎంపికై త్వరలో భారత్ తరపున ఆడనుంది.

వినోద తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. చిన్నతనం నుంచే వినోదకు క్రికెట్‌పై ఆసక్తి. ఎలాంటి ట్రైనింగ్ లేకున్నా ఆడాలన్నా పట్టుదల, సాధించాలన్న తపనే ఆమెను జాతీయ స్థాయి పోటీల వరకు ఎదిగేలా చేసింది. 8వ తరగతి చదువుతున్న సమయంలో 2005లో విజయవాడలో నిర్వహించిన అండర్-19 బాలికల విభాగంతో ఆడి చక్కటి ఆటతీరును ప్రదర్శించింది.

మొదటి ఆటలోనే ప్రతిభ చూపిన వినోద ఆ తర్వాత రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై తన ఆటతీరుతో జాతీయస్థాయికి ఎంపికైంది. అంతేకాకుండా 2008లో ఖమ్మంలో రాష్ట్రస్థాయి మహిళా క్రికెట్ పోటీల్లో చిత్తూరు, ఖమ్మం జిల్లాలు విజయం సాధించడంతో జమ్ముకాశ్మీర్‌లో జరిగిన అండర్-19 జట్టుకి వైస్ కెప్టెన్‌గా ఎంపికై చక్కటి ఆటతో విజయానికి వినోద కృషి చేసి అందరినీ ఆకర్షిందింది.

చండీగ‌ఢ్‌లోని పంచకుల అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐదు దేశాలు ఆడే టీ20 క్రికెట్ పోటీలో భారతదేశం తరపున జట్టులో రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా నుంచి వినోద, వరంగల్ జిల్లా నుంచి ఝాన్సీ లక్ష్మీకి చోటు దక్కింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy