ఉమెన్స్ వరల్డ్ కప్: ఫైనల్ కు టీమిండియా

india-women-cricket-iccమహిళా వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా రెండో సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఫైనల్‌కు దూసుకెళ్లింది మిథాలీ సేన. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ నిర్ణీత 42 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 281 పరుగుల భారీ స్కోరు చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ 171 పరుగులతో చేలరేగి నాటైట్ గా నిలిచింది. తర్వాత 282 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా లక్ష్యాన్ని చేధించలేకపోయింది. విల్లాని 75, పెర్రీ 39, బ్లాక్ వెల్ రాణించినప్పటికీ భారత బౌలర్ల ధాటిని క్రీజ్‌లో నెలబడలేకపోయారు.

భారత బౌలర్లు దీప్తి శర్మ 3, జులన్ గోస్వామి, శిఖా పాండే. చెరో రెండు వికెట్లు తీసుకోగా, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు. దీంతో 40.1 ఓవర్లలో ఆస్ట్రేలియా 245 పరుగులకు అలౌట్ అయింది. దీంతో భారత్ 36 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ చేరింది. ఫైనల్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది భారత్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy