ఉమెన్స్ సింగిల్స్ లో సింధూకు రెండో ర్యాంక్

Rio de Janeiro: India's badminton player P V Sindhu plays against Laura Sarosi of Hungary during the Women's Single match at the Summer Olympic 2016 in Rio de Janeiro, Brazil on Thursday. PV Sindhu won the match by 21-8, 21-9. PTI Photo by Atul Yadav(PTI8_11_2016_000302B)ఒలంపిక్ విజేత..భారత స్టార్ బ్యాడ్మింటన్ పీవీ సింధు మరో ఘనత సాధించింది. తన కెరీర్ లో బెస్ట్ ర్యాంకును సొంతం చేసుకుంది. బ్మాడ్మింటన్ వాల్డ్ ఫెడరేషన్ (BWF) తాజాగా ప్రకటించిన ఉమెన్స్ సింగిల్స్ ర్యాంకింగ్స్ లో 2వ స్థానాన్ని దక్కించుకుంది.

ఇటీవల జరిగిన ఇండియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో సింధు విజేతగా నిలిచింది. ఒలింపిక్ చాంపియన్ కరోలినా మారిన్ ను వరుస సెట్లలో ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. ఈ విజయంతో సింధుకు 15 లక్షల 79 వేల రూపాయలతో పాటు.. 9200 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. ఈ సిరీస్ కు ముందు ఐదో ర్యాంకులో ఉన్న సింధు… తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో రెండో స్థానానికి ఎగబాకింది. మారిన్ మూడో ర్యాంకులో కొనసాగుతోంది. చైనీస్ తైపీ ప్లేయర్ తాయ్ జుయింగ్ టాప్ ర్యాంకులో ఉంది. మరో భారత స్టార్ సైనా నెహ్వాల్ 9వ ర్యాంకు దక్కించుకుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy