ఉమెన్స్ స్పెషల్: నెంబర్ చెప్పకుండానే రీఛార్జ్

items-3రాంగ్ కాల్స్…పోకిరీల వేధింపుల నుంచి మహిళలకు ఇకపై ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టింది వొడాఫోన్.రీఛార్జ్ చేసుకునే టైం  ఆ నంబర్ ను తెలుసుకుని కొందరు మహిళలకు ఫోన్లు చేసి వేదిస్తుంటారు. అలాంటి కాల్స్ ప్రస్తుతం ఎక్కువయ్యాయి. అ లాంటి వాటికి చెక్ పెట్టేందుకు ఓ కొత్త టెక్నాలజీ ని  రూపొందించింది. మహిళల కోసం స్పెషల్ గా  సఖి పేరుతో ఫోన్ నెంబర్ చెప్పకుండానే రీచార్జ్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేట్ ని 1260కి మెసేజ్ చేస్తే వన్ టైం పాస్ వర్డు వస్తుంది. ఆ పాస్ వర్డ్ ను 24 గంటల్లో ఏదైనా రీటైల్ షాపుల్లో చెప్పి రీచార్జ్ చేసుకోవచ్చని వోడాఫోన్ తెలిపింది. ప్రస్తుతం ఇది ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో మాత్రమే ఉంది. త్వరలోనే ఈ సౌకర్యాన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకు రానుంది. దీని ద్వారా మహిళలపై వేధింపులు అరికట్టవచ్చని సంస్ధ తెలిపింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy