ఉమ్మడి అభ్యర్థిపై త్వరలో ప్రకటన

mamamthaరాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని నిలిపేందుకు రెడీ అవుతున్నాయి ప్రతిపక్షాలు. అయితే ఉమ్మడి అభ్యర్థి ఎవరనే దానిపై తమ భేటీలో చర్చకు రాలేదని చెప్పారు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన  ప్రతిపక్ష పార్టీల నేతల సమావేశం అనంతరం మమతా మీడియాతో మాట్లాడారు. అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు.సోనియా అధ్యక్షత జరిగిన విపక్షాల సమావేశానికి దేవగౌడ, శరద్‌ యాదవ్‌, శరద్‌ పవార్‌, ఏచూరి సీతారం, సురవరం సుధాకర్‌రెడ్డి, లాలూ ప్రసాద్‌ యాదవ్‌, మమతా బెనర్జీ, మాయవతి, కనిమొళి, ఒమర్‌ అబ్దుల్లా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విపక్ష నేతలకు సోనియా విందు ఇచ్చారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy