ఉమ్మడి హైకోర్టు సీజేగా రాధాకృష్ణన్ ప్రమాణం

justice-radha
రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ టీబీ రాధాకృష్ణన్‌ ప్రమాణం చేశారు. ఇవాళ (శనివారం) ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ రాధాకృష్ణన్‌చే ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌ రావు, హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తొట్టథిల్‌ భాస్కరన్‌ నాయర్‌ రాధాకృష్ణన్‌ 1959 ఏప్రిల్‌ 29న జన్మించారు. కర్నాటక కేజీఎఫ్‌ లా కాలేజి నుంచి ఆయన ఎల్‌ఎల్‌బీ చేశారు. 2004లో కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2017 నుంచి ఛత్తీస్‌గడ్‌ సీజేగా బాధ్యతలు చేపట్టారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy