ఉరిశిక్ష తీర్పుపై రివ్యూ పిటిషన్

ఎక్కువ కాలం క్షమాబిక్ష పిటిషన్ ను పెండింగ్ లో పెడితే, మరణశిక్ష ఆటోమేటిక్ గా జీవితఖైదుగా మారిపోతుందని ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుమీద కేంద్రం రివ్యూ పిటిషన్ వేసింది. రాజ్యాంగం 21 వ ఆర్టికల్ ఇచ్చిన ‘జీవించే హక్కు’కు ఈ తరహా జాప్యం వ్యతిరేకమని సుప్రీంకోర్టు తీర్పులో అభిప్రాయపడింది. క్షమాబిక్ష పిటిషన్ లు పెండింగ్ లో ఉన్న కారణంగా 15 మంది శిక్షను కోర్టు జీవితఖైదుగా మార్చేసింది. ‘మరణశిక్ష వేయడం తప్పో, కాదో వదిలేద్దాం. కానీ, ఈ శిక్ష పడినవాళ్ళు రాష్ట్రపతికి పెట్టుకున్న క్షమాబిక్ష పిటిషన్ ను నెలల తరబడీ పెండింగ్ లో పెట్టడం ఎంత అన్యాయం! చస్తానా, బతుకుతానా ? అని ఎదురుచూడడం ఎంత ఘోరం! అది టెర్రరిస్టు కావచ్చు, మామూలు నేరస్తుడు కావచ్చు ఈ వెయిటింగ్ దుర్భరం. అందుకే, మరణశిక్ష పడిన ఖైదీల క్షమాబిక్ష పిటిషన్ లను మరీ ఎక్కువ కాలం పెండింగ్ లో ఉంచితే….అలాంటి వారికి శిక్షను జీవిత ఖైదీగా మార్చాల్సిందే’ అని సుప్రీంకోర్టు ఆమధ్య ఇచ్చిన తీర్పులో క్లియర్ గా చెప్పింది. అయితే, ఈ తీర్పువల్ల చాలామంది టెర్రరిస్టులు కూడా జీవితఖైదీలుగా మారిపోయే అవకాశం ఉండడంతో కేంద్రం రివ్యూ పిటిషన్ వేసింది.

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy