ఉసిరికాయ‌లతో అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్

ఉసిరికాయ‌లు మ‌న‌కు శీతాకాలంలో ఎక్కువ‌గా ల‌భిస్తాయి. స‌హ‌జంగానే ఈ సీజ‌న్‌లో చాలా మందికి ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం, శ్వాస కోశ స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. అయితే ఆయా స‌మ‌స్య‌ల‌కు ఉసిరికాయ‌లు మ‌న‌కు చ‌క్క‌ని ప‌రిష్కారాన్ని చూపుతాయి. ఉసిరి కాయ‌ల వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు.

* ఉసిరిలో యాంటీయాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మకణాలను కాంతిమంతంగా ఉంచుతాయి. దీంతో వయసు పైబడిన లక్షణాలు దరిచేరవు. అలాగే రక్తంలో హిమోగ్లోబిన్‌, ఎర్రరక్త కణాలను వృద్ధి చేసి, రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉసిరికి ఉంది.

* గొంతు నొప్పి, దగ్గు ఉంటే ఒక టీస్పూన్‌ ఉసిరికాయ రసానికి, అర టీస్పూన్ తేనె, అర టీస్పూన్ అల్లం రసం కలిపి తాగాలి. చాలా తక్కువ సమయంలో ఉపశమనం కలుగుతుంది.

* రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గించే ఔషధగుణాలు ఇందులో ఉన్నాయి. చక్కెరవ్యాధి ఉన్నవారు రోజూ ఉసిరికాయ జ్యూస్‌ను తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది.

* ఉసిరిలో నీరూ, పీచుశాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ రెండూ జీర్ణశక్తిని మెరుగు పరుస్తాయి. అంతేకాదు కడుపు ఉబ్బరం, అజీర్తిని కూడా అరికడ‌తాయి. అలాగే విటమిన్‌ సి అధికంగా ఉండే ఉసిరికాయ‌ల‌ను ఆహారంలో చేర్చుకుంటే, జీర్ణాశయంలో పుండ్లు ఏర్పడకుండా ఉంటాయి.

* యాంటీయాక్సిడెంట్లూ, విటమిన్లూ సమృద్ధిగా ఉండే ఉసిరికాయను ప్రతీరోజూ ఆహారంలో తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకల‌ ఆరోగ్యానికి ఇందులోని క్యాల్షియం తోడ్పడుతుంది.

* హృద్రోగాలకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ శాతాన్ని పెంచడంలో ఉసిరికాయ‌లు కీలకంగా పనిచేస్తాయి. అంతేకాదు గుండెలోని రక్తనాళాల గోడలు దృఢంగా మారకుండా ఉసిరికాయ‌లు కాపాడుతాయి. దీంతో హృద్రోగాల బారిన ప‌డ‌కుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy