ఊయల ఊగితే నీళ్లు

WATER PUMP-2బిందెడు నీళ్ల కోసం బోరింగ్ పంప్ దగ్గరకెళ్లి… కిందకుమీదకు… రాడ్ కొట్టికొట్టీ… నానా తంటాలు పడుతుంటాం.  నీళ్ల కంటే ముందు ఆయాసం వస్తుంది. ఒళ్లంతా చెమటతో తడిచిపోతుంది. కానీ ఊయల ఊగితే బోర్ లోంచి నీళ్లు రావడం మీరెక్కడైనా చూశారా..? చూడకపోతే… ఇప్పుడు చూడండి.

ఊయల ఊగితే ఏమొస్తుంది. ఉత్సాహం, సంతోషం. కానీ వీటితో పాటు బోరులోంచి నీళ్లు కూడా వస్తాయి. వచ్చేలా చేశారు విద్యార్థులు. జార్ఖండ్ క్యాపిటల్ రాంచీలోని ఓ స్కూళ్లో బోర్ ను ఊయలతో కనెక్ట్ చేశారు. ఊయల అటూ ఇటూ ఊగుతుంటే… దానికి అమర్చబడిన రాడ్లు… పైకి కిందకు కదలడంతో నీళ్లు వస్తాయి. స్కూల్ అవసరాలు, విద్యార్థులు, టీచర్ల తాగునీటికి కూడా ఆ నీటినే ఉపయోగిస్తున్నారు. విద్యార్థులు, టీచర్ల క్రియేటివిటీకి ఇదో ఎగ్జాంపుల్. ఈ ఊయల బోర్ పనితీరు చాలా సింపుల్. కరెంట్ అవసరం లేదు. ఆయాసపడుతూ… రొప్పుతూ… రాడ్ పైకి కిందకు ఆడించాల్సిన పనిలేదు.  నీళ్లు కావాలన్నప్పుడల్లా… కాసేపలా ఊయల ఊగడమే. ఎంత ఫాస్ట్ గా ఊపితే… అంత ఎక్కువగా, వేగంగా నీళ్లు వస్తాయి. సింపుల్ గా చాల బాగుంది కదా. వీలుంటే మీరు ఇలా ట్రై చేయండి.

WATER PUMP-1WATER PUMP-3

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy