ఎంటర్ ది డ్రాగన్ : పాక్ జట్టులో చైనా క్రికెటర్లు

pak-chinaక్రికెట్ అంటే ఇండియా.. మ్యాచ్ అంటే భారత్ – పాకిస్తాన్. ఈ రెండు దేశాలు మధ్య గేమ్ అంటే వందల కోట్ల మంది టీవీలకు అతుక్కుపోతారు. లేటెస్ట్ గా క్రికెట్ లోకి చైనా ఎంటర్ అయ్యింది. ఆ దేశంలో ఆటకు ప్రజాదరణ తీసుకురావటానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆటగాళ్లకు శిక్షణలో భాగంగా పాకిస్తాన్ తో ఒప్పందం చేసుకుంది. వచ్చే ఏడాది (2019)లో పాక్ లో జరిగే సూపర్ లీగ్ లో పోటీల్లో ఇద్దరు చైనా ఆటగాళ్లు క్రికెట్ ఆడనున్నారు. దీనికి పాక్ క్రికెట్ బోర్డ్ కూడా అంగీకారం తెలిపింది.

పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో పెషావర్ జాల్మి టీం తరపున చైనా నేషనల్ క్రికెట్ టీంకి చెందిన ఇద్దరు ఆటగాళ్లు ఆడుతున్నారని.. ఇందుకు సంబంధించిన అనుమతి కూడా లభించిందని.. ఇది పాక్ క్రికెట్ కు పెద్ద ఊరటగా పేర్కొంది బోర్డ్. అంతర్జాతీయంగా ఎవరూ పాక్ లో క్రికెట్ మ్యాచ్ లు ఆడటానికి నిరాకరిస్తున్న టైంలో చైనా రూపంలో మంచి జరుగుతుందని భావిస్తోంది పాక్ బోర్డ్. పాక్ – చైనా సంబంధాలు కూడా మరింత బలోపేతం అవుతాయరని.. చైనాలో క్రికెట్ అభివృద్ధికి పాక్ సహకారం ఉంటుందని భావిస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది పాకిస్తాన్.

చైనాలో పురుషులు, మహిళల క్రికెట్ జట్లు ఉన్నా.. ఆశించిన స్థాయిలో ఆదరణ లేదు. ఇప్పటి వరకు క్రికెట్ క్రీడపై చైనా ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టలేదు. దీంతో చైనా జట్లకు గుర్తింపు లేదు. రాబోయే రోజుల్లో క్రికెట్ లోనూ చైనా కీలకంగా వ్యవహరించటానికి పాక్ – చైనా సహకారం కలిసి వస్తుందని డ్రాగన్ అంచనా వేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో పలు మ్యాచుల్లో చైనా జట్లు పాల్గొన్న వాటిని ఆదరణ కరువు అయ్యింది. ఈ క్రమంలోనే పాక్ సూపర్ లీగ్ లో చైనా ఆటగాళ్ల ఎంట్రీతో.. చైనా దేశంలో ఇతర దేశాల క్రికెట్ జట్టులతో క్రికెట్ ఆడేందుకు పాక్ కు ఓ అవకాశం వచ్చినట్లు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy