ఎంట్రీ ఇస్తున్న మూడో ఎన్టీఆర్!

టాలీవుడ్ తెరపైకి త్వరలో మరో ఎన్టీఆర్ రానున్నాడు. ఎన్టీఆర్ మునిమనవడు, హరికృష్ణ మనవడు, జానకిరామ్ కొడుకు మాస్టర్ ఎన్టీరామారావు యాక్టర్ గా ఎంట్రీ ఇవ్వనున్నాడు. చిన్న పిల్లలతో వస్తున్న ‘దానవీరశూరకర్ణ’లో శ్రీకృష్ణ పాత్ర వేయనున్నాడు ఈ ఎన్టీఆర్. ఈ సినిమా కోసం జరిపిన టాలెంట్ హంట్ లో విన్నర్ గా నిలిచాడు మాస్టర్ ఎన్టీఆర్. జె.వి.ఆర్ ఈ సినిమాకు డైరెక్షన్ చేయనున్నాడు.  టాలీవుడ్లో ఇతను మూడో ఎన్టీఆర్. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ ను ఒక ఊపు ఊపగా, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్ పై సందడి చేస్తున్నాడు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy