ఎండలకు స్మాల్ బ్రేక్ : మరో 48 గంటలు వర్షాలు

nagaరాష్ట్రంలో వర్షాలకు కారణం అసాధారణ ఉష్ణోగ్రతలే అన్నారు హైదరాబాద్ వాతావరణ అధికారి నాగరత్న. మండుతున్న ఎండలతో గాలి వేడెక్కడం వల్ల, వాతావరణంలో ఖాళీ ప్రదేశం ఏర్పడుతుందనీ, ఈ ఖాళీ ప్రదేశంలోకి  సముద్రం మీదనుంచి చల్లగాలులు రావడం వల్ల కలిగే పీడనంతో వర్షాలు పడుతున్నాయని చెప్పారు. వర్షాలు మరో 48గంటలు ఉంటాయన్నారు. మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని.. ఈ వర్షాలు తాత్కాలికమే అన్నారు. ఈ సీజన్ లో భద్రాచలం, ఆదిలాబాద్, నిజామాబాద్ లో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని చెప్పారు. జూన్ మొదటి వారం వరకు ఎండలు ఎక్కువగానే ఉంటాయన్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy