ఎండలో తిరిగితే జబ్బులకు చెక్ పెట్టొచ్చు

vitamin-d-sunlight-21366503విట‌మిన్ డీ… ఆరోగ్యానికి చాలా మంచింది. ప్ర‌తిరోజు సూర్యుడు ఉద‌యించిన త‌ర్వాత వచ్చే ఎండ‌లో శ‌రీరానికి  విట‌మిన్ డీ పుష్క‌లంగా దొరుకుతుంది.   విట‌మిన్ డీ సూర్య‌కిర‌ణాల నుంచి ఏ స‌మ‌యం నుంచి ఎంత‌వ‌ర‌కు ల‌భిస్తుందో అనేదానిపై చాలామందికి సందేహం ఉండొచ్చు. కేవ‌లం సూర్యోద‌యం అయిన‌ప్పుడు వ‌చ్చిన ఎండ‌నుంచే విట‌మిన్ డీ ల‌భిస్తుంద‌నేది వాస్త‌వం కాదంటున్నారు నిపుణులు. ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ద్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు వ‌చ్చే ఎండ కూడా శ‌రీరానికి చాలా మేలు చేస్తుంద‌ని, అయితే ఎండాకాలంలో మాత్రం వైద్యుల సూచ‌న‌లు తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. 20-25% శాతం శరీరానికి నేరుగా తగిలేలా, 40 నిమిషాలపాటు ఎండలో ఉండాలని సూచిస్తున్నారు.

విటమిన్‌ డి లోపంవల్ల వచ్చే సమస్యలెన్నో.. కాల్షియం, ఫాస్పరస్‌, ప్రోటీన్లు, విటమిన్‌-డి కలిసి ఎముకల పటిష్టతకు, కండరాల పటుత్వానికి దోహదపడతాయి. డి-విటమిన్‌ లోపిస్తే.. మిగతా వాటిని శరీరం గ్రహించదు. విట‌మిన్ డీ లోపంతో చాలామంది మ‌హిళ‌ల్లో ఎముక‌లు ప‌టిష్ట‌త లేక‌పోవ‌డం ఇత‌ర‌త్రా జ‌బ్బులు రావ‌డంలాంటివి ఉంటున్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. నడివయసు దాటినవారిలో 40% మంది ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ఎండ‌లో తిర‌గ‌ట‌మేన‌ని వైద్యులు చెబుతున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy