ఎంత కష్టం తల్లీ : 200 అడుగుల లోతుకి చిన్నారి

baby-fallరంగారెడ్డి జిల్లా ఇక్కారెడ్డిపల్లిలో బోరుబావిలో పడిన చిన్నారి అంతకంతకు కిందకు జారింది. శుక్రవారం మధ్యాహ్నం 40 అడుగుల దగ్గరే ఉన్న పాప.. మోటారు తీయటంతో 70 అడుగుల కిందకు జారింది. ఆ తర్వాత తర్వా వర్షం పడటం, ఇతర కారణాలతో పాప 200 అడుగుల వరకు కనిపించటం లేదు. అత్యాధునిక కెమెరాలను పంపిన NDRF సిబ్బందికి.. చిన్నారి జాడ 200 అడుగుల దగ్గర కూడా కనిపించలేదు. దీంతో ఆందోళన మరింత పెరిగింది. కెమెరాకి కూడా జాడ దొరక్కపోవటంతో అందరిలో టెన్షన్ నెలకొంది. నిరంతరం ఆక్సిజన్ బోరుబావిలో పంపిస్తున్నారు. ONGC సిబ్బంది కూడా రంగంలోకి దిగింది. ఆటోమేటిక్ రోబో, మాన్యువల్ రోబో ద్వారా పాపను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. బోరుబావి మొత్తం 490 అడుగులు ఉంటుందని చెబుతున్నారు. పాప ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా బయటకు తీసి తల్లిదండ్రులకు అప్పగిస్తామని చెబుతున్నారు మంత్రి మహేందర్ రెడ్డి. 200 అడుగుల గుంతను సమాంతరంగా తీయాలంటే చాలా టైం పడుతుందని.. అయినా ఆ ప్రక్రియ కొనసాగిస్తూనే ఉన్నారు. పాప సజీంగా బయటకురావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy