ఎంత పెద్దదో : 5లక్షల కోట్ల కంపెనీ HDFC

hdభారత్ లో ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉన్నబ్యాంక్‌గా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రికార్డు సృష్టించింది. ఈ రోజు బ్యాంక్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.5లక్షల కోట్లను దాటింది. ఈ మార్క్‌ను దాటిన మూడో భారతీయ కంపెనీగా హెచ్ డీఎఫ్ సీ రికార్డ్ నమోదు చేసింది. ఈ రోజు బ్యాంక్ మార్కెట్ షేర్లు 2.5శాతం ఎగసి రూ.1,938కు చేరాయి. దీంతో మార్కెట్‌విలువ రూ.5.02లక్షల కోట్లకు చేరింది. ఇప్పటి వరకూ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం టీసీఎస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మాత్రమే ఈ మార్కును దాటాయి. ప్రస్తుతం రూ.5.86లక్షల కోట్లతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మొదటి స్థానంలో ఉండగా,  రూ.5.46లక్షల కోట్లతో టీసీఎస్ రెండో స్థానంలో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు ప్రతి త్రైమాసికంలోనూ స్థిరంగా పెరుగుతూ వస్తుండటం, మొండిబకాయిల సమస్య తక్కువగా ఉండటంతో ఆ సంస్థ షేర్లు ర్యాలీ చేస్తున్నాయి.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy