ఎంత ప్రేమో : ఆఫర్లు లేకున్నా.. జియోనే ముద్దు

jioమార్కెట్‌లో నిత్యం సంచలనాలు సృష్టిస్తున్నది రిలయన్స్ జియో. ఆఫర్లపై ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకుంటుంది. ఇకపై ఎలాంటి ఆఫర్లు ఇవ్వకపోయినా అందులోనే కొనసాగాలని చాలా మంది యూజర్లు అనుకుంటున్నారట. బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. ఈ సంస్థ జియో నెట్‌వర్క్‌ను వాడుతున్న యూజర్లను సర్వే చేసింది. ఈ సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

రిలయన్స్ జియో సిమ్‌లను తీసుకున్న వారిలో ఇప్పటికే 90 శాతం మందికి పైగా జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను పొందారని సర్వే స్పష్టం చేసింది. ఆఫర్లు ఉన్నా, లేకపోయినా ఇప్పటికి వరకు జియోకు ఉన్న యూజర్లలో 76 శాతం మంది అందులోనే కొనసాగుతామని నిర్ణయించుకున్నట్లు సర్వేలో పేర్కొన్నారు. రూ.303, రూ.309 ప్యాక్‌లను 84 శాతం మంది యూజర్లు వేసుకున్నారు. వీరందరూ రోజుకు 1 జీబీ 4జీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, యాప్ సర్వీస్‌లను ఉచితంగా పొందుతున్నారు.

జియోను వాడుతున్న వారిలో 80 శాతం మంది కేవలం ఒక్క జియో సిమ్‌నే వాడుతున్నారట. 20 శాతం మందికి ఒకటి కన్నా ఎక్కువ జియో సిమ్‌లు ఉన్నాయట. ఇక జియో సిమ్‌లను చాలా మంది రిలయన్స్‌కు చెందిన లైఫ్ ఫోన్లు, ఐఫోన్లు, శాంసంగ్ ఫోన్లలోనే వాడుతున్నారట. మొత్తం మీద 41 శాతం మంది జియో యూజర్లకు ఇప్పటికీ కాల్స్ సరిగ్గా కనెక్ట్ అవడం లేదని సర్వే ద్వారా తెలిసింది. ఈ సమస్యను కూడా త్వరలో అధిగమిస్తామని జియో యాజమాన్యం చెబుతోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy