ఎందుకీ వివక్ష : రోడ్డుపై.. బ్రిడ్జి కింద జాకీచాన్ కూతురు

Jackie Chan's estranged daughter1హాలీవుడ్ యాక్షన్‌స్టార్ జాకీచాన్ కుమార్తె ఎట్టా ఎన్జీకి నిలువనీడ లేదు. స్నేహితురాలు ఆండీ ఆటుమ్న్‌తో కలిసి హాంగ్‌ కాంగ్‌ లోని ఓ ఫ్లైఓవర్ కింద నివాసం ఉంటుంది. తన జీవితాన్ని వీడియో రూపంలో యూట్యూబ్‌ లో పోస్ట్‌ చేసింది ఎన్జీ. కొంతకాలం కిందట తన తండ్రి జాకీచాన్ నుంచి విడిపోయింది ఎలాయినె ఎట్టా. వీరిద్దరికి పుట్టిన బిడ్డే ఎట్టా ఎన్జీ. ఉండేందుకు ఇల్లు లేక హాంగ్‌ కాంగ్ వీధుల్లోనే బికారిలా తిరుగుతున్నాను అని చెపుతుంది ఎన్జీ. ప్రస్తుతం తన దయనీయ స్థితికి హొమోఫోబిక్ తల్లిదండ్రులే కారణం అని ఆరోపించింది ఆమె.

హొమోఫోబిక్ తల్లిదండ్రుల కారణంగా నెల రోజులుగా నిరాశ్రయులుగా మారాం. బ్రిడ్జి కిందే నిద్రపోయాం. మేం పోలీసుల దగ్గరకు, ఆస్పత్రులు, ఫుడ్ బ్యాంకులకు వెళ్లాం.. స్వలింగ సంపర్కుల ఆశ్రయాలనూ సైతం సందర్శించాం.. ఎవ్వరూ కూడా ఆశ్రయం కల్పించటం లేదని చెబుతోంది ఎట్టా. ప్రస్తుతం ఏం చేయాలో అర్థంకావట్లేదు.. ఏం జరుగుతుంతో ప్రజలకు తెలుసు అంటోంది.

జాకీచాన్ ప్రస్తుత భార్య జాన్‌ లిన్‌ ను పెళ్లి చేసుకునే ముందే.. ఆయనకు ఎలాయినె ఎన్జీ అనే మహిళతో ఉన్న సంబంధంతో ఎట్టా ఎన్జీ జన్మించారు. ఆ తర్వాత విడిపోయారు. అయినా వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు జాకీచాన్ కల్పించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా కుమార్తె ఎన్జీ ఆరోపణలను ఖండించారు తల్లి ఎలాయినే. డబ్బులు లేకపోతే ఉద్యోగం చూసుకోవాలని.. తండ్రితో విడిపోయానని చెప్పేలా వీడియో క్లిప్‌లు తీయడం సరికాదన్నారు. పక్కవారిపై ఆధారపడకుండా కష్టపడి సంపాదించుకోవాలని సూచించారు ఎన్జీ తల్లి ఎలాయినే. ఎన్జీ మరో మహిళతో సహజీవనం చేయటాన్ని ఇంట్లో వాళ్లు వ్యతిరేకించటం వల్లే ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు హాంకాంగ్ పత్రికల కథనం.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy