ఎందుకు భయపడుతున్నారు : శుక్రవారం.. 13వ తేదీ అంటే..

13-47513.. ఈ పేరు వింటే చాలు.. వామ్మో అని భయపడుతుంటారు అమెరికన్లు. అంతేకాదు… 13 తారీఖు.. శుక్రవారం కలిసి వస్తే.. ఆ భయానికి హద్దే ఉండదు. సరిగ్గా ఈ రోజు.. అదే తేదీ.. అదే రోజు వచ్చింది. దీన్ని ఫ్రిగాట్రిస్కైడెకా ఫోబియా అంటారు. అమెరికాలోనే ఈ భయం ఎక్కువ మంది. అధ్యయనసంస్థల లెక్కల ప్రకారం.. సుమారు 2 కోట్ల మంది అమెరికన్లు ఈ ఫోబియాతో బాధపడుతున్నారు. ఫ్రైడే థర్టీన్త్ వచ్చిందంటే చాలు.. ఆరోజు ఎవరూ ఏ పనీ చేయకుండా ఇళ్లకే పరిమితమవుతారు. ఏ శుభకార్యాలు స్టార్ట్ చేయరు. అపార్ట్ మెంట్లలో కూడా 13వ అంతస్తు ఉండదక్కడ. అంతేకాదు.. 13వ వ్యక్తిగా, 13వ సారి.. ఇలా దేన్నీ వాళ్లు అంగీకరించరు. ఈ 13 నంబర్ వల్ల ఏటా అమెరికాకు 52వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందట.

కొన్ని ఆసక్తికర విషయాలు:

.. 1980ల్లో ఫ్రైడే ద థర్టీన్త్.. హారర్ మూవీ సిరీస్ అమెరికన్లలో ఈ ఫోబియాను మరింత పెంచింది. 2009లో ఈ సిరీస్‌లో చివరి సినిమా వచ్చింది.

.. ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ 13తేదీ శుక్రవారం రోజే పుట్టాడు. విచిత్రం ఏంటంటే ఆయన తొలి సినిమా కూడా నంబర్ 13 పేరుతో నిర్మాణం అయ్యింది. అయితే ఆర్థిక కారణాలతో విడుదల కాలేదు.

ఇంతకూ భయానికి కారణమేమిటి..?

.. బైబిల్ ప్రకారం శుక్రవారం రోజునే ఆడమ్, ఈవ్ యాపిల్ తిన్నారు.  ఆ తర్వాత సైతాన్ తన ప్రతాపం చూపడం మొదలైంది.

.. అంతేకాదు క్రీస్తుతో చివరి విందులో(లాస్ట్ సప్పర్) పాల్గొన్నది కూడా 13 మందే.  ఆ ఘటన తర్వాతే యేసును శిలువ వేస్తారు.

ఇలా పలు కారణాలతో ఈ సంఖ్యను, ఆరోజును లింక్ పెట్టుకుని జనం భయపడుతున్నారు. అయితే ఆ నంబర్ మంచిదే అంటున్నారు అధ్యయనవేత్తలు. శుక్రవారం 13వ తేదీన ప్రమాదాలు తక్కువగా జరుగుతున్నట్లు వీళ్లు గుర్తించారు. ఈ లెక్కన ఇవాళ డ్రైవింగ్ సేఫ్ అంటూ ఈ అధ్యయనం తేల్చింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy