ఎంపీగా వరెస్ట్ రికార్డు సొంతం చేసుకున్న సచిన్

tendulkarక్రికెట్ లో సచిన్ టెండుల్కర్ ఎవరెస్ట్. కానీ రాజకీయాల్లో వరెస్ట్ అనిపించుకుంటున్నాడు మాస్టర్. రాజ్యసభ సభ్యుడిగా టోటల్ గా ఫెయిలయ్యారాయన. అటెండెన్స్ లో వరెస్ట్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. రాజ్యసభ సభ్యుడిగా మూడేళ్ల కెరీర్ లో కేవలం 5 శాతం సగటుతో కొనసాగింది ఆయన అటెండెన్స్.

235 రోజుల్లో 13రోజులే హాజరు

సచిన్ టెండుల్కర్. రెండున్నర దశాబ్దాల పాటు క్రికెట్ కెరీర్ లో తిరుగులేని రికార్డులెన్నో సొంతం చేసుకున్న లెజెండ్. వంద సెంచరీలు. కెరీర్ లో ఆరు వరల్డ్ కప్ లు ఆడిన అనుభవం. అన్నింటికి మించి దేశ అత్యున్నత అవార్డ్ భారతరత్నను సొంతం చేసుకున్న వన్ అండ్ ఓన్లీ స్పోర్ట్స్ పర్సనాలిటీ సచిన్. మాస్టర్ గుర్తింపుకు అరుదైన గౌరవాన్నిస్తూ… అప్పటికేంద్ర ప్రభుత్వం అతనికి రాజ్యసభకు నామినేట్ చేసింది. 2012 మే 2న పెద్దల సభలో ప్రమాణస్వీకారం చేశాడు సచిన్. క్రికెట్ లో ఎవరెస్ట్ ఎత్తుకు ఎదిగిన సచిన్.. పార్లమెంట్ మెంబర్ గా దేశ క్రీడారంగాన్ని అదే రేంజ్ కు తీస్కెళ్తాడని ఆశించారంతా. కానీ అదంతా వట్టిదే అయింది. సచిన్ 2012లో రాజ్య స భ స భ్యుడిగా ఎన్నికైన నాటినుంచి ఇప్పటివరకు 12 సెషన్లలో 235 రోజుల బిజినెస్ జరిగింది. కానీ అందులో సచిన్ పాల్గొంది ఎన్ని రోజులో తెలుసా. కేవలం 13 రోజులు మాత్రమే. హాజరు శాతం 5.1 మాత్రమే.

పార్ల మెంట్ శీతాకాల స మావేశాలు వాష్ అవుట్ అయ్యాక… మన మెంబర్స్ పర్ ఫామెన్స్.. అటెండెన్స్ కు సంబంధించి డేటాను రిలీజ్ చేసారు. అందులో సచిన్ అంత వరెస్ట్ రికార్డ్ ఇంకో మెంబర్ కు లేదని తేలింది. అంతేకాదు క్రికెట్ జీనియస్ కావచ్చు.. కానీ చట్టసభల్లో ఇలాంటి వ్యక్తి అవసరమా అన్న కామెంట్స్… తోటి సభ్యుల నోటి నుంచి వినిపిస్తున్నాయి. మాస్టర్ గైర్హాజ రీని రాజ్య సభలోని సభ్యులు తీవ్రంగా తప్పుపట్టారని తెలిసింది. కనీసం స్టాండింగ్ కమిటీ సమావేశాలకు కూడా రాకుండా డుమ్మా కొట్టడం అతని అహంకారానికి నిదర్శనమన్న గుసగుసలు వినిపించాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్ల మెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు సచిన్. ఈ ఏడాది ఐదురోజుల పాటు జ రిగిన నార్త్ ఈస్ట్ స్టడీ టూర్ జరిగింది. స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా.. ఆ టూర్ కి కచ్చితంగా హాజరుకావాల్సింది. దానికీ డుమ్మా కొట్ట డంతో క మిటీలోని స భ్యులు ఏకంగా హోదా నుంచి తొల గించాల ని డిమాండ్ చేసారట.

క్రికెటర్ హోదా నుంచి లా మేకర్ స్థాయికి ఎదిగినా… రాజ్య సభ సభ్యుడిగా అతని వల్ల దేశానికి ఒరిగిందేం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజ్యసభలో ఒకే ఒక్కసారి తన వాయిస్ వినిపించాడు మాస్టర్. కేంద్రంలోని పలు మంత్రిత్వ శాఖలకు క్రీడాభివృద్ధి కోసం కొన్ని అంశాల పై విజ్ఞప్తులు పంపించాడు. కొత్త విద్యావిధానంలో క్రీడలకు భాగస్వామ్యం కల్పించాల ని స్మృతి ఇరానీ ప్రాతినిధ్యం వహిస్తున్న మానవ వనరుల శాఖను ప్రశ్నించాడు. అయితే ఆ ప ని ఎంత వరకు వచ్చింద నే విషయంలో ఫోకస్ చేయలేదు.

ఎంపీ లాడ్స్ వినియోగంలో సచినే ఫస్ట్..

అటెండెన్స్ లో వరెస్ట్ రికార్డ్ సొంతం చేసుకున్నా.. ఎంపీ ల్యాడ్స్ నిధులను ఖర్చుచేయడంలో మాత్రం సచిన్ అందరికన్నా ముందున్నాడు. 98 శాతం నిధులను ఖర్చు చేసి టాప్ ప్లేస్ కొట్టేశాడు. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు కండ్రిగను సచిన్ దత్తత తీసుకున్నాడు. దానికోసం ఎక్కువ నిధులు కేటాయించడాని సమాచారం. కాశ్మీర్, తమిళనాడు, ఉత్తరాఖండ్ వరదల్లో నష్ట పోయిన ప్రాంతాల అభివృద్ధికి మరికొన్ని నిధులను వాడుకున్నట్టు అధికారిక లెక్కల్లో తేలింది. ఇక స్వచ్ఛ్ భారత్ బ్రాండ్ అంబాసిడర్ గా కేంద్రం అతన్ని ఎంపిక చేసి.. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ లో కీలక బాధ్యతలు అప్పగించింది మోడీ సర్కారు. ఆ కార్యాన్ని సరిగా చేయలేక విమర్శలెదుర్కొన్నాడు మాస్టర్. డెడికేషన్ కు, సిన్సియారిటీకి మారుపేరు సచిన్. క్రీడాభివృద్ధితో పాటు దేశ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తాడన్న కారణంతో రాజ్యసభకు నామినేట్ చేశారు ప్రెసిడెంట్. కానీ ఈ కొత్త హోదాకు న్యాయం చేయకలేకపోయాడు మాస్టర్. మరో మూడేళ్ల పాటు పెద్దల సభలో ఉంటాడు. ఈ గ్యాప్ లోనైనా ఏమైనా చేస్తాడేమో చూడాలి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy