ఎంపీలు, ఎమ్మెల్యేల గొడవలకు రూల్ బుక్ తో బ్రేక్ ?

Lok_Sabhaఎంపీలు, ఎమ్మెల్యేల బిహేవియర్ ను మార్చేందుకు కేంద్రం ప్రభుత్వం రెడీ అయింది. పార్లమెంట్ లోపలా… బయటా ఎంపీలు ప్రవర్తిస్తున్న తీరు… విమర్శలకు తావిస్తున్నందువల్ల వాటికి అడ్డుకట్ట వేయాలని మోడీ ప్రభుత్వం డిసైడైంది. దీనికోసం ఎంపీలకు ఓ కొత్త రూల్ బుక్ రెడీ చేస్తోంది. ఇకపై ఎంపీలు ఆ రూల్ బుక్ లోని రూల్స్ ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది. తాము ఎంపీలమని… ప్రజల చేత ఎన్నుకున్నవాళ్ళమని మరచిపోయి వాళ్ళు చేసే పనులను గమనిస్తుంటే… చిరాకుగా ఉంటుంది. ప్రతీదానికి పార్లమెంట్ లో చర్చను ఆపేసి రచ్చ చేయడం… కామన్ అయిపోయింది. అంతా స్పీకర్ పోడియంపైకి ఎగబడడం అలవాటుగా మార్చుకున్నారు. అయినదానికీ… కానిదానికీ పోడియంను చుట్టుముడుతున్నారు. ప్రతిపక్షాలు రభస చేస్తోంటే… అధికార పార్టీ ఎంపీలు కూడా తామేమీ తక్కువ తినలేదన్నట్టు… ప్రతిపక్షాలను అడ్డుకునేందుకు తమవంతుగా రచ్చ చేస్తున్నారు. ఇలాంటివాటికి చెక్ చెప్పాలని కేంద్ర ప్రభుత్వం డిసైడైంది. ఎంపీల కోసం ప్రత్యేకంగా కట్టుబాట్లతో కూడిన హ్యాండ్ బుక్ ని రూపొందించనుంది. దీనికోసం పార్లమెంట్  సెక్రటేరియట్ కసరత్తు మొదలుపెట్టింది. అందులో ఎంపీలు చేయాల్సిన పనులు, పాటించాల్సిన రూల్స్… చేయకూడనివి… ఇలా అన్నీ పెట్టనున్నారు. దీనిని త్వరలోనే రూల్ బుక్ గా మార్చాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. ఇలా చేస్తే తప్ప పార్లమెంటులోనూ, అసెంబ్లీలోనూ గొడవలు తప్పవని ప్రభుత్వం అనుకుంటోంది. పార్లమెంట్ లో ఏం జరుగుతుందో ప్రజలు చూస్తూనే ఉంటారు. అందుకే పార్లమెంట్, ప్రజాప్రతినిధుల క్రెడిబిలిటీ ఇంప్రూవ్ చేసేందుకు, జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి కృషి చేస్తున్నామని చీఫ్ విప్ లకు పంపిన నోట్ లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటివరకు జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటినుంచి అలా కుదరదు. ప్రజాప్రతినిదులు పార్లమెంట్, అసెంబ్లీల లోపల కాని, బయట కాని అనుచితంగా ప్రవర్తిస్తే… వారిని శిక్షించే అధికారం పార్లమెంట్ కు ఉందనేది కేంద్రం ఉద్దేశం.

సందర్భాన్ని బట్టి శిక్షలు….

సందర్భాన్ని బట్టి… శిక్షలుంటాయని తెలుస్తోంది. మందలింపుతో మొదలు సస్పెన్షన్, డిస్మిస్ మాత్రమ  కాదు.  జైలు శిక్ష కూడా విధించేలా రూల్ బుక్ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. వీటన్నింటిని పర్యవేక్షించడానికి… పార్లమెంట్ లో 2 ఎథిక్స్ కమిటీలు పనిచేస్తాయి. మెంబర్ల ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచడంతో పాటు, వారిపై వచ్చిన కంప్లయింట్ లు, వారిపై ఉన్న కేసులను కూడా ఈ కమిటీలు పరిశీలిస్తాయి. హుందాగా నడుచుకోవడం, సభామర్యాదలు పాటించడం, స్పీకర్ పట్ల గౌరవ మర్యాదలతో ప్రవర్తించడం, తమకు కేటాయించిన సీట్లలోనే కూర్చోవడం, అక్కడి నుంచే మాట్లాడడం, సైలెన్స్ మెయిన్ టెయిన్ చేయడంలాంటివన్నీ విధిగా పాటించాల్సి ఉంటుంది. సభలో నినాదాలు చేయడం, అనవసరంగా నిలబడి గందరగోళం సృష్టించడం,  ప్లకార్డులు, జెండాలు ప్రదర్శించడం, పేపర్లు చించి వెదజల్లడం, పేపర్ బాల్స్ ని విసరడం, ధర్నాల్లాంటివి చేయడం,  తిట్టడం, సభ లోపలే కాదు, పార్లమెంటు ఆవరణలో, అసెంబ్లీ ఆవరణలో కూడా ఈ రూల్స్ వర్తిస్తాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రత్యక్షంగా కానీ… పరోక్షంగా కానీ… వారి ఇన్ ఫ్లూయెన్స్ ఉన్న కంపెనీలకు గవర్నమెంట్ ద్వారా ఎలాంటి లబ్ది చేకూర్చకూడదు. కానీ, సరైన మానిటరింగ్ లేకపోవడంతో ఇది అమలు కావడంలేదు. దీన్ని కూడా ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy