ఎంపీల కోసం ఎలక్ట్రిక్ బస్సులు

Green Bus imageఢిల్లీలో రోజురోజుకీ పెరిగిపోతున్నపర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంపీల కోసం కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ బస్సులను ఏర్పాటుచేసింది. ఈ బస్సులను పార్లమెంటు ఆవరణలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు.మేక్ ఇన్ ఇండియా ఆవిష్కరణలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు ప్రవేశపెట్టామన్నారు ప్రధాని. ఈ బస్సుల ద్వారా  శబ్దం, వాయు కాలుష్యం ఉండవు అని స్పష్టం చేశారు. పర్యావరణ మార్పులపై ఫ్రాన్స్ సదస్సులో అన్ని దేశాలు ఏకతాటిపైకి వచ్చాయన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని సదస్సులో నిర్ణయం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పాటు పలువురు ఎంపీలు పాల్గొన్నారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy