ఎంపీ మురళీమోహన్ వివరణ : వేంకటేశ్వరస్వామిని వెంకన్న చౌదరి అనటం తప్పే

murliతిరుమల ఏడుకొండల వేంకటేశ్వరస్వామి.. వెంకన్నచౌదరి అంటూ టీడీపీ రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ అన్న మాటలు సంచలనం అయ్యాయి. మోసం చేసిన బీజేపీకి కర్నాటకలో వెంకన్నచౌదరి తగిన బుద్ది చెప్పారని.. వెంకన్న చౌదరి సాక్షిగా ఇచ్చిన హామీని తప్పారంటూ రాజమండ్రి మహానాడులో వ్యాఖ్యానించారు ఎంపీ మురళీమోహన్. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టీడీపీ కుల పిచ్చి, అహంకారానికి పరాకాష్ఠ అంటూ దుమ్మెత్తిపోశారు నెటిజన్లు. ఈ వ్యాఖ్యలు పెద్ద వివాదం కావటం స్వయంగా వివరణ ఇచ్చారు ఆయన.

రాజమండ్రి మినీ మహానాడులో తాను తిరుపతి ఏడుకొండలవాడి గురించి మాట్లాడుతూ వెంకన్న చౌదరి అని నోరుజారిన మాట వాస్తవమే అన్నారు. అందుకు క్షమాపణలు చెప్పారు. అప్పటి వరకు బుచ్చయ్యచౌదరితో మాట్లాడుతూ.. ప్రసంగానికి పిలవడంతో వెంకన్న చౌదరి అనడం జరిగిందే తప్ప.. ఉద్దేశ పూర్వకంగా వచ్చింది కాదని అన్నారు. ఏడుకొండల వాడంటే ఎంతో భక్తిప్రపత్తులు ఉన్నాయన్నారు. నోరుజారి అన్నమాటను ఇంత పెద్ద ఇష్యూ చేస్తారని అనుకోలేదని వివరణ ఇచ్చారు. స్వామివారితో పాటు.. భక్తులు అందరికీ క్షమాపణలు చెప్పారు. తనకు అన్ని కులాలు సమానమే అని.. కుల దురభిమానం లేదని తెలిపారు. ఏడుకొండలవాడికి కులం ఆపాదించే తెలివితక్కువ వాడిని కాదన్నారు. పొరపాటున వచ్చిన మాటకు పెద్దమనసుతో క్షమించాలని కోరారు. ఈరోజు ఉదయమే ఏడుకొండలవాడి పూజ సందర్భంగా దీనిపై స్వామివారిని మన్నింపు వేడుకున్నట్లు చెప్పారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy