ఎంసెట్ : ఇవాళ ప్రైమరీ కీ..18న రిజల్ట్స్

exam-resultsరాష్ట్రం మొదటి సారిగా ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన ఎంసెట్‌ ప్రవేశ పరీక్ష సోమవారం(మే-7)తో విజయవంతంగా ముగిసింది. ఎంసెట్‌ ప్రాథమిక ‘కీ’ని మంగళవారం(మే-8) విడుదల చేయనున్నట్లు కన్వీనర్‌ యాదయ్య తెలిపారు. www.eamcet.tsche.ac.in వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. ‘కీ’ పై అభ్యంతరాలుంటే ఈ నెల 10వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంసెట్‌ ఫలితాలను ఈ నెల 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు. ఎంసెట్‌ పరీక్షకు హాజరైన విద్యార్థులకు వారి జవాబు OMR పత్రాలను మెయిల్‌ ఐడీకి పంపించనున్నారు.  ఈ నెల 2 నుంచి 7వ తేదీ వరకు 8 షిఫ్టులలో నిర్వహించిన ఎంసెట్‌కు మొత్తం 2,20,990 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 2,03,168 మంది పరీక్షకు హాజరయ్యారు. తొలిసారి ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన ఈ పరీక్ష విజయవంతమైంది. ఇందుకు సహకరించిన వారికి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి, కన్వీనర్‌ యాదయ్య కృతజ్ఞతలు తెలిపారు. అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ విభాగానికి 66,857 మంది, ఇంజనీరింగ్‌ విభాగానికి 1,36,311 మంది విద్యార్థులు హాజరయ్యారు.

మరోవైపు ఇప్పటికే కాలేజీల్లో తనిఖీలు నిర్వహించి ఏయే కాలేజీల్లో ఎలాంటి లోపాలు ఉన్నాయి…వాటి ఆధారంగా ఏయే కోర్సుల్లో ఎన్ని సీట్లకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలన్న ప్రక్రియను JNTUH పూర్తి చేసింది. ఫలితాలను వెల్లడించిన వెంటనే ప్రవేశాల కౌన్సెలింగ్‌కు కాలేజీలు, సీట్ల జాబితాను అందజేయనుంది. మొత్తానికి ఈ నెలాఖరులో ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

 

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy