ఎంసెట్-3 నోటిఫికేషన్ ఇవాళ రిలీజ్..?

Telangana EAMCET 2016ఎంసెట్-2 లీకేజీ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నిస్తోంది సర్కార్. ఎంసెట్ -2 రద్దు చేస్తున్నట్లు ఇవాళ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. శనివారం మంత్రులు, అధికారులతో భేటీ అయిన సీఎం కేసీఆర్… సోమవారం నిర్ణయం తీసుకుంటారని భావించినా.. అది ఇవాళ్టికి పోస్ట్ పోన్ అయిందని చెబుతున్నాయి అధికారిక వర్గాలు.  ఎంసెట్ 2 పై హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు కావడం…పిటిషన్ సోమవారం విచారణకు రాకపోవడంతో అధికారిక ప్రకటనను ఇవాళ్టికి వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ ఎంసెట్ 2 ను రద్దు చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించి… ఎంసెట్-3 నోటిఫికేషన్ కూడా విడుదల చేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ఎంసెట్-2పై సీఎం కేసీఆర్ ప్రకటన చేస్తారని చెప్పారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ఇవాళ మరోసారి మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్ భేటీ తర్వాత…. ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు అధికారులు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy