ఎక్కడున్నావో కానీ : జాతీయ ఉత్తమ నటిగా శ్రీదేవి

Sridevi-Momప్రముఖ నటి, ఇటీవలే చనిపోయిన శ్రీదేవికి జాతీయ ఉత్తర నటి అవార్డ్ దక్కింది. మామ్ మూవీలో అద్భుత నటనకు ఈ గౌరవం దక్కింది. 54 ఏళ్ల వయస్సులో శ్రీదేవి నటించిన మామ్ చిత్రం విమర్శకుల ప్రశంశలు పొందింది. ఇద్దరు పిల్లలతో తల్లి పడే ఇబ్బందులను చక్కగా చూపించింది ఈ చిత్రం. ఇందులో నటించిన శ్రీదేవి.. నటనకు అప్పట్లో మంచి గుర్తింపు లభించింది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఓ మంచి చిత్రంలో చేశానని.. ఈ మూవీ నటిస్తున్నంత సేపూ నా కూతుళ్లు గుర్తుకొచ్చారని పలు సందర్భాల్లో చెప్పింది శ్రీదేవి.

శ్రీదేవి ఇటీవలే దుబాయ్ లోని ఓ హోటల్ లోని బాత్ టబ్ లో మునిగి చినిపోయిన విషయం తెలిసిందే. మే 3వ తేదీన ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమం ఉంటుంది. శ్రీదేవి తరపున భర్త, పిల్లలు ఈ అవార్డ్ అందుకోనున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy