ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు

rationప్రయోగాత్మకంగా హైదరాబాద్ లో అమలు

రేషన్‌ వినియోగదారుల కష్టాలు తీర్చడానికి నూతన విధానాన్ని అమలు చేస్తుంది రాష్ట్ర పౌరసరఫరాల శాఖ.   తమకు కేటాయించిన రేషన్‌ దుకాణంలోనే కాకుండా, ఎక్కడ వీలయితే అక్కడ రేషన్‌ సరుకులు తీసుకునే వెసులుబాటు అందుబాటులోకి తెస్తోంది. ‘రేషన్‌ పోర్టబిలిటీ’ విధానంపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది సివిల్ సప్లై శాఖ. హైదరాబాద్‌ పరిధిలోని 1,545 రేషన్‌ దుకాణాల్లో ప్రయోగాత్మకంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి రేషన్‌ పోర్టబిలిటీ విధానం అమల్లోకి రాగా, ఇప్పటివరకు సుమారు 70 వేల లావాదేవీలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. రెండు నెలల్లో రేషన్‌ పోర్టబిలిటీని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని  సివిల్‌ సప్లై అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం వినియోగదారుల ఆధార్‌ కార్డుల అనుసంధానాన్ని వేగవంతంగా పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ–పాస్‌ అమలులో ఉన్న అన్ని రేషన్‌ షాపుల్లో పోర్టబిలిటీ సాధ్యమవుతుందని, దీంతో ఈ–పాస్‌లో వినియోగదారుల ఆధార్‌ కార్డు వివరాలను నమోదు చేయాలంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఈ–పాస్‌ యంత్రాలను అమర్చే కార్యక్రమం శరవేగంగా జరుగుతోందని చెపుతున్నారు ఆ శాఖ అధికార వర్గాలు. హైదరాబాద్‌లోని రేషన్‌ దుకాణాల్లో ఈ–పాస్‌ యంత్రాలను వినియోగించడం వల్ల 14 నెలల కాలంలో రూ.280 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17,200 రేషన్‌ దుకాణాల్లో ఈ–పాస్‌ను అమలు చేస్తే ఏటా రూ.800 కోట్లు ఆదా అవుతుందని అంచనా వేశారు సివిల్‌ సప్లై అధికారులు. దీంతో రాష్ట్రంలోని అన్ని రేషన్‌ దుకా ణాలను ఈ–పాస్‌ పరిధిలోకి తెస్తున్నారు. ఇప్పటికే మహబూబ్‌నగర్‌ జిల్లాలో పూర్తికాగా, ఈ జిల్లాలోని 800 రేషన్‌ దుకాణల పరిధిలో రూ.3.39 కోట్లు ఆదా అయినట్లు చెబుతున్నారు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ముగింపు దశలో ఉందని, మిగిలిన అన్ని జిల్లాల్లో రెందు నెలల వ్యవధిలో పూర్తిస్థాయిలో  యంత్రాలను అమర్చే పని పూర్తవుతుందని అధికార వర్గాలు వెల్లడించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy